హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్

పిరమల్ ఫైనాన్స్ హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ హోమ్ లోన్‌పై అర్హత

మీరు హోమ్‌ లోన్‌కి దరఖాస్తు చేయాలని యోచిస్తున్నారా, కానీ మీరు అర్హులా అనే విషయం ఖచ్చితంగా తెలియదా? ఆన్‌లైన్‌ కేల్కులేటర్‌ని ఉపయోగించడం మీ హోమ్‌ లోన్‌ అర్హతను చెక్‌ చేసుకునేందుకు జంజాటం లేని మార్గం. మీరు హోమ్‌ లోన్‌కి అర్హులా అనే విషయం నిర్థారించుకునేందుకు లెండింగ్‌ సంస్థలు వివిధ అంశాలను పరిగణిస్తాయి.

పీరమల్‌ ఫైనాన్స్‌ హోమ్‌ లోన్‌ అర్హత కేల్కులేటర్‌లో, లోన్‌కి మీరు అర్హులా అనే విషయం నిర్థారించుకునేందుకు మీరు వివిధ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.హోమ్‌ లోన్‌కి దరఖాస్తు చేసిన తరువాత ఇల్లు కొనేవారు దీనివల్ల తిరస్కరించబడకుండా ఉంటారు.

20కె10లక్షలు
05లక్షలు
%
10.50%20%
సంవత్సరాలు
5సం30సం
మీ హోమ్ లోన్ అర్హత

అర్హత పట్టిక లేదా చార్టు

వయసగరిష్ట వ్యవధి
25 సంవత్సరాలు30 సంవత్సరాలు
30 సంవత్సరాలు30 సంవత్సరాలు
35 సంవత్సరాలు30 సంవత్సరాలు
40 సంవత్సరాలు30 సంవత్సరాలు
45 సంవత్సరాలు25 సంవత్సరాలు
50 సంవత్సరాలు20 సంవత్సరాలు

అమోర్టిజేషన్‌ చార్ట్‌

హోమ్‌ లోన్‌ అమోర్టిజేషన్‌ షెడ్యూలును ఈ కింద చూడండి:

సంవత్సరం చెల్లించవలసిన లోన్‌ మొత్తం అసలు మొత్తం వడ్డీ మొత్తం ఇఎంఐ
2022
₹ 5,181,170.00
₹ 66,908.58
₹ 43,176.42
₹ 110,085.00
2023
₹ 5,114,261.42
₹ 847,750.56
₹ 473,269.44
₹ 1,321,020.00
2024
₹ 4,266,510.86
₹ 936,521.11
₹ 384,498.89
₹ 1,321,020.00
2025
₹ 3,329,989.75
₹ 1,034,587.12
₹ 286,432.88
₹ 1,321,020.00
2026
₹ 2,295,402.63
₹1,142,921.90
₹ 178,098.10
₹ 1,321,020.00
2027
₹ 1,152,480.73
₹ 1,152,515.47
₹ 58,419.53
₹ 1,210,935.00

హోమ్‌ లోన్‌ అర్హత అంటే ఏమిటి?

హోమ్‌ లోన్‌ అర్హత అనేది దరఖాస్తుదారుని యొక్క పరపతిని రుణదాత నిర్థారించే ప్రామాణికత సెట్‌గా విశదీకరించబడుతోంది. ముందుగా నిర్ణయించిన వ్యవధి లోపల లోన్‌ని తిరిగి చెల్లించడంలో మీరు సఫలం కావడానికి హోమ్‌ లోన్‌ అర్హతను ఆర్థిక సంస్థలు చెక్‌ చేస్తాయి.

హోమ్‌ లోన్‌ అర్హత ప్రామాణిక

పీరమల్‌ ఫైనాన్స్‌లో, హోమ్‌ లోన్‌ అర్హత ప్రామాణికత ఈ కింది విధంగా ఉంటుంది:

 • అర్హులవ్వాలంటే దరఖాస్తుదారులు స్వయం ఉపాధి చేస్తుండాలి లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ రంగ ఎంటర్‌ప్రైజ్‌ లేదా ఎంఎన్‌సి ఉద్యోగం చేస్తుండాలి.
 • స్వయం ఉపాధి చేసుకునే దరఖాస్తుదారులకు, హోమ్‌ లోన్‌కి వయోపరిమితి 23 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది.
 • ఉద్యోగం చేసేవారికి వయో పరిమితి 21 నుంచి 62 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే, గరిష్ట వయో పరిమితి 70 సంవత్సరాలు ఉంటుంది.
 • పీరమల్‌ ఫైనాన్స్‌ హోమ్‌ లోన్‌కి ప్రాధాన్యం ఇవ్వబడే సిబిల్‌ స్కోరు 750.

పీరమల్‌ ఫైనాన్స్‌ హోమ్‌ లోన్‌ అర్హతను ఎలా చెక్‌ చేయాలి?

తనఖా అర్హత చెక్‌ కోసం, మీరు పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హౌసింగ్‌ లోన్‌ అర్హత కేల్కులేటర్‌ని ఉపయోగించవచ్చు. మీ అర్హతను నిర్థారించేందుకు, మీ వృత్తి, వయస్సు, ఆదాయం లాంటి సమాచారాన్ని మీరు నమోదు చేయాలి. మీకు ఎంత మొత్తంలో అప్పు లభిస్తుందనేది మీ అర్హతను బట్టి నిర్ణయించబడుతుంది.

హోమ్‌ లోన్‌ అర్హతను ఎలా లెక్కించాలి?

హోమ్‌ లోన్‌ అర్హత లెక్కింపు అనేది ప్రాథమికంగా దరఖాస్తుదారుని యొక్క వార్షిక ఆదాయాన్ని మదింపు చేసిన తరువాత చేయబడుతుంది. ఆ తరువాత, దరఖాస్తుదారుని వయస్సు, క్రెడిట్‌ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు, మరియు ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకోబడతాయి.

హోమ్‌ లోన్‌ అర్హతను ప్రభావితం చేసే అంశాలు

‘‘నాకు ఎంత మొత్తంలో హోమ్‌ లోన్‌ లభిస్తుంది’’ అనే దానికి సమాధానం ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

స్వయం ఉపాధికులు

డాక్టర్లు మరియు ఆర్కిటెక్ట్‌లు లాంటి స్వయం ఉపాధి చేసుకునే ప్రొఫెషనల్స్‌ కూడా హోమ్‌ లోన్‌కి దరఖాస్తు చేయవచ్చు. హోమ్‌ లోన్‌కి అర్హులవ్వాలంటే స్వయం ఉపాధి చేసుకునే ప్రొఫెషనల్స్‌కి వయో పరిమితి 23 నుంచి 70 సంవత్సరాలు.

ఆదాయం

దరఖాస్తుదారులు ఎక్కడ నివసిస్తున్నారనే దాని ప్రకారం పీరమల్‌ ఫైనాన్స్‌కి నిర్దిష్ట నెలవారీ నికర ఆదాయం ఉంది. హోమ్‌ లోన్‌ అర్హత కేల్కులేటర్‌ని ఉపయోగించేటప్పుడు, మీ రుణ దరఖాస్తు ఆమోదించబడిందా అనే విషయం చెక్‌ చేసేందుకు మీరు మీ నికర ఆదాయం నమోదు చేయవలసి ఉంటుంది.

స్వతంత్ర ప్రొఫెషనల్స్‌

వ్యాపార యజమానులు, భాగస్వామ్య సంస్థల భాగస్వాములు, మరియు యజమానులు లాంటి స్వతంత్ర ప్రొఫెషనల్స్‌ కూడా పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌ లోన్‌కి అర్హులవుతారు. హోమ్‌ లోన్‌కి అర్హులవ్వాలంటే స్వతంత్ర ప్రొఫెషనల్స్‌కి వయో పరిమితి 23 నుంచి 70 సంవత్సరాలు.

లోన్‌ వ్యవధి

మీరు ఎంచుకున్న లోన్‌ వ్యవధికి మీ హౌసింగ్‌ లోన్‌ అర్హత మొత్తంపై భారీ ప్రభావం ఉంటుంది. మీరు సుదీర్ఘ హోమ్‌ లోన్‌ వ్యవధిని ఎంచుకున్నప్పుడు, మీ ఇఎంఐలు తక్కువగా ఉంటాయి. మీరు హోమ్‌ లోన్‌ అర్హత చెకర్‌లో మీరు అధిక లోన్‌ వ్యవధిని నమోదు చేసినప్పుడు, ఇఎంఐలు మరింత సరసంగా మారతాయి కాబట్టి మీకు ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వయో పరిమితి

దరఖాస్తుదారులకు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగి లేదా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌గా ఉండాలనుకుంటున్నారో బ్యాంకులు తెలుసుకోవాలనుకుంటాయి. మీరు మీ రిటైర్‌మెంట్‌కి కొన్ని సంవత్సరాల ముందు హోమ్‌ లోన్‌ పొందుంటే, ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ కెరీర్‌లో ప్రారంభ సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఇతర దరఖాస్తుదారుల కంటే మీకు ఖచ్చితంగా పైచేయిగా ఉంటుంది.

అవుట్‌స్టాండింగ్‌ లోన్‌(న్స్‌)

మీరు హౌసింగ్‌ లోన్‌ అర్హతను చెక్‌ చేసేటప్పుడు, అనేక లోన్స్‌ మరియు అప్పులు మీ అవకాశాలను ప్రభావితం చేయవు. అయితే, చెల్లించకుండా ఉండిపోయిన లోన్స్‌ అనేకం ఉంటే, అది సమస్య అవుతుంది. ఇఎంఐ చెల్లింపు తేదీలు మిస్సవ్వడం మరియు క్రమశిక్షణలేని క్రెడిట్‌ చరిత్ర మీ హోమ్‌ లోన్‌కి ఆమోదం పొందే అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

సిబిల్‌ స్కోరు రిపోర్టు

మీ క్రెడిట్‌ చరిత్రను బాగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంమీ సిబిల్‌ స్కోరు రిపోర్టు చూపిస్తుంది. మీ రీపేమెంట్‌ చరిత్ర, క్రెడిట్‌కార్డు బకాయిలు, మరియు ఇప్పుడున్న లోన్స్‌ లాంటి అంశాలపై మీ సిబిల్‌ స్కోరు ఆదారపడి ఉంటుంది. 300 నుంచి 900 స్కేలుపై 750 ఆదర్శవంతమైన సిబిల్‌ స్కోరు ఉండటం హోమ్‌ లోన్‌కి అర్హత ఉంటుంది. మీ రీపేమెంట్‌ సామర్థ్యం మరియు ఆర్థిక విశ్వసనీయతను అంచనావేయడం మీ సిబిల్‌ స్కోరును చెక్‌ చేయడం యొక్క ఉద్దేశం.

వడ్డీ రేటు

ఫిక్స్‌డ్‌ రేటు, ఫ్లోటింగ్‌ రేటు, లేదా మిశ్రమ వడ్డీ రేటు ఆప్షన్‌లు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) చేసే మార్పులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. తాజా ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఇఎంఐలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే పెరిగినప్పుడు పెరుగుతుంటాయి. ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు మీ లోన్‌ వ్యవధి అంతటా స్థిరంగా ఉండిపోతుంది. మిశ్రమ వడ్డీ రేట్లు ఉన్న లోన్స్‌ ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుకు మారిపోవడానికి ముందు నిర్ణీత కాలం పాటు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటుకు ఉండిపోతాయి.

ఎల్‌టివి మరియు ప్రాపర్టీ విలువ

మీరు లోన్‌ తీసుకుంటున్న ప్రాపర్టీని కూడా రుణదాతలు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కలల ఇంటి మార్కెట్‌ విలువ ఎక్కువగా ఉంటే, మీరు అధిక లోన్‌ విలువకు అర్హులవుతారు. కాబట్టి, మీ ఫండ్స్‌ని గణనీయంగా పెరగడానికి మీరు సరైన విలువను ఎంచుకోవలసిన అవసరం ఉంటుంది.

మీరు చేసే డౌన్‌పేమెంట్‌ని మరియు మీకు అవసరమైన ఫైనాన్సింగ్‌ సొమ్మును కూడా బ్యాంక్‌ చెక్‌ చేస్తుంది. 20% డౌన్‌ పేమెంట్‌కి మీ వద్ద మూలదనం ఉన్నప్పుడు హోమ్‌ లోన్‌ పొందడం సులభతరమవుతుంది. మీకు మరిన్ని ఫండ్స్‌ అవసరమైతే, మీరు సాధారణంగా అధిక వడ్డీ రేటు చెల్లించవలసి ఉంటుంది.

ఉద్యోగం చేసే వ్యక్తి

ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, వాళ్ళు ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్నప్పటికీ హోమ్‌ లోన్‌కి అర్హులవుతారు. ప్రభుత్వ సంస్థలు, ఎంఎన్‌సిలు, యాజమాన్య సంస్థలు మరియు భాగస్వామ్య సంస్థల ఉద్యోగులు కూడా అర్హులు. పైగా, ఎన్‌జిఒలు లేదా సంబంధిత సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా అర్హులవుతారు.

హౌసింగ్‌ లోన్‌కి అర్హులు కావడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, మరియు గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి 70 సంవత్సరాలు ఉంటుంది, దీనికి కారణం వాళ్ళకు పెన్షన్‌ ఉంటుంది కాబట్టి. అయితే, వ్యక్తి ఆదాయం సమకూర్చుతున్నంత కాలం హోమ్‌ లోన్‌ని పొందవచ్చు.

హోమ్‌ లోన్‌ అర్హతను ఎలా పెంచుకోవాలి?

మీరు హోమ్‌ లోన్‌ అర్హతను పెంచుకోవాలనుకుంటే, మీరు ఈ కింది వాటిని మనసులో ఉంచుకోవాలి:

 • మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న సహ-దరఖాస్తుదారును ఎంచుకోండి.
 • 750 కంటే ఎక్కువగా సిబిల్‌ స్కోరు ఉండాలి.
 • ఎల్లప్పుడూ మీ అప్పు సకాలంలో తీర్చండి
 • మీ అదనపు ఆదాయ వనరులను ప్రకటించండి
 • మీ హోమ్‌ లోన్‌ని తిరిగి చెల్లించేందుకు సుదీర్ఘ వ్యవధిని ఎంచుకోండి.
 • ఆదాయానికి ఫిక్స్‌డ్‌ ఉత్తరదాయిత్యాన్ని 40% లోపు ఉంచుకోండి.
 • అత్యధిక డౌన్‌ పేమెంట్‌ చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు

హోమ్‌ లోన్‌ పొందడానికి కావలసిన కనీస జీతం ఎంత?
piramal faqs

నా జీతానికి నాకు ఎంత మొత్తంలో హోమ్‌ లోన్‌ లభిస్తుంది?
piramal faqs

హోమ్‌ లోన్‌ అర్హత చెకర్‌ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందా?
piramal faqs

నేను బ్యాంక్‌ నుంచి ఎంత మొత్తంలో హోమ్‌ లోన్‌ పొందగలను?
piramal faqs

హోమ్‌ లోన్‌ అర్హత డాక్యుమెంట్లు ఏమిటి?
piramal faqs

హోమ్‌ లోన్‌ అర్హతలో సహ-దరఖాస్తుదారుని పాత్ర ఏమిటి?
piramal faqs

హోమ్‌ లోన్‌ సబ్సిడీకి అర్హత ప్రామాణికత ఏమిటి?
piramal faqs

ఇప్పుడున్న నా హోమ్‌ లోన్‌కి అదనంగా నేను టాప్‌-అప్‌ లోన్‌ పొందవచ్చా?
piramal faqs

నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీకి నేను లోన్‌ తీసుకోవచ్చా?
piramal faqs

ఉమ్మడి హోమ్‌ లోన్‌కి ఎవరు అర్హులు?
piramal faqs

నా హోమ్‌ లోన్‌కి సహ-దరఖాస్తుదారులుగా ఉండటానికి నా పిల్లలకు అర్హత ఉంటుందా?
piramal faqs

నేను హోమ్‌ లోన్‌ తీసుకుంటే నాకు పన్ను ప్రయోజనాలకు అర్హత ఉంటుందా?
piramal faqs

నాకు చెడు క్రెడిట్‌ స్కోరు ఉంటే నాకు హోమ్‌ లోన్‌కి అర్హత ఉంటుందా?
piramal faqs

నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీకి రుణవితరణ ప్రక్రియ ఏమిటి?
piramal faqs

హోమ్‌ లోన్‌కి దరఖాస్తు చేసినప్పుడు ఏం సెక్యూరిటిని ఇవ్వవలసి ఉంటుంది?
piramal faqs

కొత్త ప్రాపర్టీని కొనడానికి ఇప్పుడున్న నా లోన్‌ అకౌంట్‌ ద్వారా నేను అత్యధిక లోన్‌ పొందవచ్చా?
piramal faqs