మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు లేదా మమ్మల్ని మా టోల్ ఫ్రీ నంబరు 1800266444లో సంప్రదించవచ్చు.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్)తో, నిర్మాణంలో ఉన్న/చేరడానికి సిద్ధంగా ఉన్న/రీసేల్ ప్రాపర్టీల కొనుగోలు కోసం మీరు హోమ్ లోన్ పొందవచ్చు.
ప్లాట్ కొనడానికి మరియు దానిలో ఇంటి నిర్మాణానికి కూడా మీరు హోమ్ లోన్ పొందవచ్చు, లేదా సొంత ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి లోన్ పొందవచ్చు.
సహ-దరఖాస్తుదారు ఉండటం తప్పనిసరి మరియు కలిగివుండాలని సలహా ఇవ్వబడుతోంది. సహ-దరఖాస్తుదారు కలిగివుండటం మీ అర్హతను పెంచవచ్చు, సహ-దరఖాస్తుదారు ఆదాయం సముపార్జిస్తే, మరియు హోమ్ లోన్ మంజూరు చేయబడే అవకాశాలు మీకు ఉంటాయి. పైగా, మీ ప్రాపర్టీ యొక్క సహ-యజమానులు సహ-దరఖాస్తుదారులై ఉండాలి, కానీ సహ-దరఖాస్తుదారులు సహ-యజమానులై ఉండవలసిన అవసరం లేదు.
మీ వ్యక్తి అయితే, మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి లేదా మీ మేజర్ పిల్లలు కూడా మీ సహ-దరఖాస్తుదారులు కావచ్చు. అంతే కాకుండా, భాగస్వామ్య సంస్థ, ఎల్ఎల్పి, మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటి వ్యక్తి కాని సంస్థలు కూడా సహ-దరఖాస్తుదారు కావచ్చు.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ‘‘రోజువారీగా తగ్గిపోయే బ్యాలెన్స్’’పై వడ్డీ లెక్కకట్టబడుతుంది మరియు నెలవారీ రెస్ట్‌తో విధించబడుతుంది.
ఫిక్స్డ్ వడ్డీ రేటు లోన్ అంటే మీ వడ్డీ రేటు నిర్ణీత కాలానికి లాక్ ఇన్ (అంటే ఫిక్స్డ్)గా ఉంటుంది.
వేరియబుల్ వడ్డీ రేటు లోన్ అనేది ఆర్థిక సంస్థ సమీక్షించినప్పుడు ఆర్‌పిఎల్‌ఆర్/బిపిఎల్ఆర్లో మార్పుతో వడ్డీ రేటు మారిపోతుంది.
ఇఎంఐ అంటే లోన్ కింద చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా. ఇఎంఐలో లోన్ అసలు మరియు దానిపై ఉండే వడ్డీ రేటు కలిసివుంటుంది.
ప్రీ- ఇఎంఐ వడ్డీని వాస్తవంగా ఇఎంఐ ప్రారంభం కావడానికి ముందు మరియు పాక్షికంగా పొందిన రుణ మొత్తంపై చెల్లించాలి. ఇది ప్రధానంగా స్వీయ నిర్మాణంలో లేదా నిర్మాణ దశతో ముడిపడివున్న వితరణల్లో కలుగుతుంది.
రుణాన్ని సంపూర్ణంగా వితరణ చేసిన తరువాత ఇఎంఐ ప్రారంభమవుతుంది. కాబట్టి, రుణాన్ని సంపూర్ణంగా వితరణ చేసేంత వరకు పాక్షికంగా వితరణ చేయబడిన రుణ మొత్తంపై ప్రీ-ఇఎంఐ వడ్డీ విధించబడుతుంది.
సాధారణంగా, కొన్న ప్రాపర్టీ వ్యయంలో 90% వరకు అప్పుగా ఆర్థిక సంస్థ ఇస్తుంది. ప్రాపర్టీ వ్యయానికి మరియు పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) రుణ మొత్తానికి మధ్య గల తేడా మొత్తం మీ స్వీయ కంట్రిబ్యూషన్‌గా ప్రస్తావించబడుతోంది, ప్రాపర్టీని కొనేందుకు కొనుగోలుదారు దీనికి డబ్బు చెల్లించాలి.
మొబైల్ నంబరు మరియు ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసేందుకు మీరు మా వెబ్సైట్ Existing customer > Email / Mobile update సెక్షన్‌ని చూడవచ్చు.
లోన్ని సంపూర్ణంగా చెల్లించిన తరువాత, సంబంధిత బ్రాంచ్ కార్యాలయం నుంచి తీసుకునేందుకు డాక్యుమెంట్లు సిద్ధమైతే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేందుకు మా బ్రాంచ్ అధికారులు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
గమనిక: ప్రాపర్టీ డాక్యుమెంట్ల సేకరణ సమయంలో చెల్లుబాటయ్యే అసలు గుర్తింపు ధృవీకరణతో పాఉట దరఖాస్తుదారులు మరియు సహ- దరఖాస్తుదారులు అందరూ హాజరవ్వాలి.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్)తో, మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలు వేటికైనా మీరు లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ పొందవచ్చు. ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఎపి)ని పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్)కి బదిలీ చేయవచ్చు.
మీరు మీ నివాస/వాణిజ్య ప్రాపర్టీని తనఖాపెట్టవచ్చు, ఇది సంపూర్ణంగా నిర్మించినదై, స్వంతది మరియు చార్జ్ ఏదీ లేనిది అయివుండాలి.
అవును, మీరు ప్రీ- అప్రూవ్డ్ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు, తిరిగి చెల్లించేందుకు మీ ఆదాయం మరియు సామర్థ్యంపై ఆధారపడి ఇవ్వబడే లోన్‌కి ఇది సూత్రప్రాయ ఆమోదం. మంజూరు లేఖ తేదీ నుంచి 90 రోజుల పాటు సూత్రప్రాయ మంజూరు చెల్లుతుంది.
ఇక్కడక్లిక్ చేయడం ద్వారా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్‌కి కావలసిన పత్రాల చెక్‌లిస్టును మీరు పొందవచ్చు.
అవును, ఇప్పుడున్న హోమ్ లోన్, హోమ్ ఇంప్రూమెంట్ లోన్ లేదా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ ఉన్న ఖాతాదారులందరూ, ప్రస్తుత హోమ్ లోన్ని అంతిమంగా వితరణ చేయబడిన 12 నెలల తరువాత మరియు ఇప్పుడున్న ఫైనాన్స్డ్ ప్రాపర్టీని స్వాధీనం/పూర్తిచేసిన మీదట టాప్ అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు మా వెబ్సైట్ www.piramalfinance.com > Customer Service > Loan statement.సందర్శించడం ద్వారా మీ లోన్ యొక్క రీపేమెంట్ షెడ్యూలు/లోన్ అకౌంట్ పరిష్కారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లోన్ అకౌంట్ నంబరు ఉపయోగించి స్టేట్మెంట్ని పొందవచ్చు.
అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద ఆర్థిక సంవత్సరంలో మీ రీపేమెంట్ల్లో వడ్డీ మరియు అసలు రెండిటికీ పన్ను ప్రయోజనాలు పొందడానికి మీరు అర్హులవుతారు.
నెలవారీ వాయిదా నుంచి మూలం వద్ద పన్ను మినహాయింపు అవసరమైన రుణగ్రహీత, తన రిజిస్టర్డు ఈమెయిల్ ఐడి నుంచి customercare@piramal.comకి డిజిటల్‌గా సంతకం చేసిన ఫారం 16ఎ పంపడం ద్వారా టిడిఎస్ రిఫండ్ని తీసుకోవచ్చు.
ఫారం 16ఎ అందిన మీదట మరియు ‘‘ట్రేసెస్’’ వెబ్సైట్లో టిడిఎస్ సొమ్ము ప్రతిబింబించిన మీదట రిఫండ్ ప్రాసెస్ చేయబడుతుంది. లోన్ కింద నెలవారీ వాయిదా చెల్లించే రుణగ్రహీత యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి టిడిఎస్ రిఫండ్ క్రెడిట్ చేయబడుతుంది.
మా వెబ్సైట్ www.piramalfinance.com > Customer Service > Loan statement
చూడటం ద్వారా మీరు ప్రొవిజనల్/తుది ఆదాయపు పన్ను స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లోన్ అకౌంట్ నంబరు ఉపయోగించి స్టేట్మెంట్ని పొందవచ్చు.
ఒకవేళ ఏవైనా అనుకోని/దురదృష్టకర ప్రతికూల సంఘటనలు కలిగితే మరియు బాధ్యతలను పరిమితం చేస్తే, బీమా కవరేజి ఉండటం వల్ల ఖాతాదారుకు మరియు కుటుంబ సభ్యులకు రిస్కును తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి బీమా పొందవలసిందిగా మేము ఖాతాదారులకు సూచిస్తున్నాము మరియు వాళ్ళ అవసరాలకు సరిపోయే అత్యుత్తమ ప్రోడక్ట్ మరియు ఇన్సూరెన్స్ భాగస్వామిని మూల్యాంకనం చేయవచ్చు.
జీవిత బీమా - నిర్దిష్ట వ్యవధికి రుణగ్రహీతకు మరియు/లేదా సహ-రుణగ్రహీతలకు అవుట్‌స్టాండింగ్ లోన్‌పై ఆర్థిక కవరేజ్ అందిస్తున్న టర్మ్ ప్లాన్. ఇతర నష్టాలను కవర్ చేసేందుకు కూడా అదనపు రైడర్లు లభిస్తున్నాయి.
ప్రాపర్టీ ఇన్సూరెన్స్- లోన్ కింద ఫైనాన్స్ చేసిన ప్రాపర్టీకి కలిగిన డేమేజ్కి ఈ బీమా కవరేజ్.
రుణాన్ని మూసివేసిన తరువాత బీమా కంపెనీకి బీమా పాలసీని సరెండర్ చేసే లేదా కొనసాగించే ఆప్షన్ మీకు ఉంటుంది.
సమీపంలో ఉన్న పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) బ్రాంచ్ని సందర్శించడం ద్వారా మీరు ఇఎంఐ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్‌ని మార్చుకోవచ్చు మరియు మీ కొత్త రీపేమెంట్ అకౌంట్ నుంచి ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించవచ్చు:
1 క్యాన్సిల్డ్ చెక్కు
9 అప్డేటెడ్ చెక్కులు
3 ఒరిజినల్స్‌లో ఎన్ఎసిహెచ్ మేండేట్ ఫారం
రీపేమెంట్ స్వాప్ చార్జీలకు 1 చెక్కు/డిడి
ఒకవేళ మీ ఇఎంఐ తిరిగొస్తే/బౌన్స్ వస్తే, తదుపరి 3 పని దినాల లోపు మీ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్‌కి ఇది సూచించబడుతుంది.
వర్తించే చార్జీల వివరాల కొరకు దయచేసి ఎంఐటిసిచూడండి
ఎన్ఎసిహెచ్ ఈ-మేండేట్ అనేది ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు (ఇఎంఐలు) లాంటి వాయిదాలకు కాలానుగుణ ప్రాతిపదికపై రుణగ్రహీత యొక్క బ్యాంకు అకౌంట్‌కి డెబిట్ చేయవలసిందిగా ‘‘లెండింగ్ సంస్థకు’’ రుణగ్రహీత ఇచ్చిన స్థాయీ నిర్దేశనం.
ఎన్ఎసిహెచ్ ఈ-మేండేట్ని సెటప్ చేసేందుకు 2 విభిన్న మార్గాలు ఉన్నాయి:
ఎన్ఎసిహెచ్ ఈ-మేండేట్ యొక్క ప్రయోజనాలు:
ప్రస్తుతం ఈ-మేండేట్ రిజిస్ట్రేషన్ అత్యధిక బ్యాంకులకు లభిస్తుంది. ఈ సర్వీసు అందించేందుకు ఎన్పిసిఐ వద్ద ప్రస్తుతం రిజిస్టర్ చేయబడిన బ్యాంకుల జాబితాను చెక్ చేసేందుకు మీరు ఈ కింది లింకు చూడవచ్చు.
నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి సంబంధిత బ్యాంకుల యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
https://www.npci.org.in/PDF/nach/live-members-e-mandates/Live-Banks-in-API-E-Mandate.pdf
మా వెబ్సైట్ www.piramalfinance.com > www.piramalfinance.com > Customer Services > E-Mandate >కి లాగిన్ అవ్వండి
ఎన్ఎసిహెచ్ ఈ-మేండేట్ కోసం రిజిస్టరు చేసుకునేందుకు పాటించవలసిన చర్యల డెమో వీడియో చూడటానికి ఈ-మేండేట్పై క్లిక్ చేయండి.
లేదు, ఇది పూర్తిగా ఉచితం. పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఈ సదుపాయానికి రుణగ్రహీతకు చార్జ్ ఏదీ చేయదు?
ఎన్ఎసిహెచ్ ఈ-మేండేట్ని విజయవంతంగా ఆథంటికేషన్ చేసిన తరువాత, రుణగ్రహీత యొక్క బ్యాంక్ పేజీ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ని ప్రదర్శిస్తుంది.
ఈ-మేండేట్కి కనీసం రూ. 5,000 మరియు గరిష్టం రూ. 10 లక్షలు.
ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి రుణగ్రహీతలకు గణనీయంగా ఆర్థిక ఇత్తిడి కలిగించింది. ప్రమోటర్లకు ఇప్పుడు మంచి ఘన చరిత్ర ఉన్నప్పటికీ, ఈ ఒత్తిడి వల్ల అనేక సంస్థలు అప్పుల భారంతో దీర్ఘకాలంలో మనుగడ సాగించడంపై ప్రభావం చూపించవచ్చు, ఇలాంటి విస్త్రుత ప్రభావం పూర్తి రికవరి ప్రక్రియను బలహీనపరచవచ్చు, ఇది గణనీయంగా ఆర్థిక స్థిరత్వానికి రిస్కు కలిగించవచ్చు.
ఆర్బిఐ చేసిన ప్రకటనకు అనుగుణంగా (‘‘కోవిడ్-19 సంబంధ ఒత్తిడికి పరిష్కార ఫ్రేమ్‌వర్క్’’పై జారీచేసిన తన సర్క్యులర్ DOR.No.BP.BC/3/21.04.048/2020-21 తేదీ ఆగస్టు 06, 2020), పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఒక పాలసీని రూపొందించింది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద సహాయంకోసం అభ్యర్థించిన ఖాతాదారులకు సుగమం చేసేందుకు బోర్డు ఈ పాలసీని ఆమోదించింది. ఈ ఉద్దేశం కోసం ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఈ కిందివి తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్ఎక్యూలు):
ఈ కింద పేర్కొన్నట్లుగా ఈ కింది ప్రామాణికత మొత్తాన్ని రుణగ్రహీతలు నెరవేర్చవలసి ఉంటుంది,
రుణగ్రహీత వ్యక్తిగత రుణగ్రహీత అయివుండాలి
కోవిడ్-19 పరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న రుణగ్రహీత
రుణగ్రహీత అకౌంట్లు ప్రామాణికంగా వర్గీకరించబడతాయి, మార్చి 21, 2020 నాటికి 30 రోజులకు పైగా డిఫాల్ట్ అయివుండకూడదు.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) రిటైల్ పోర్టుఫోలియోలోని ప్రస్తుత రుణగ్రహీతలు.
పరిష్కార ఫ్రేమ్‌వర్క్ కింద సహాయం కోసం పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్)ని అభ్యర్థిస్తూ రుణగ్రహీత సంప్రదిస్తే, పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) తన పాలసీ ప్రకారం ఇలాంటి అభ్యర్థనను మూల్యాంకనం చేస్తుంది మరియు కేసులోని మెరిట్స్‌తో సంతృప్తిచెందితే, పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) యొక్క స్వీయ విఛక్షణ ప్రకారం పరిష్కార ఫ్రేమ్‌వర్క్ కింద సహాయం పరిగణించబడుతుంది.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) రిటైల్ డివిజన్ సంభాళించే రుణాలన్నిటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ కింది రుణాలకు ఈ పాలసీ వర్తిస్తుంది: (ఎ) హౌసింగ్ లోన్స్, (బి) లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ (స్థిరాస్తులను కొనేందుకు లేదా నిర్మాణం కోసం లోన్‌తో సహా పర్సనల్ లోన్స్)
దరఖాస్తు చేయాలనుకునే రుణగ్రహీతలు customercare@piramal.comకి ఈమెయిల్ రాయవచ్చు. మీ అభ్యర్థనను మరింతగా ప్రాసెస్ చేసేందుకు ఈమెయిల్ అందిన మీదట మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
రుణగ్రహీతల యొక్క ఆదాయాన్ని బట్టి పరిష్కార ప్రణాళికల్లో ఉండొచ్చు:
చెల్లింపులను రీషెడ్యూలు చేయడం
ప్రాప్తించిన ఏదైనా వడ్డీని మరొక క్రెడిట్ సదుపాయంలోకిమార్చడం
మారటోరియం మంజూరు చేయడం
వ్యవధి పొడిగింపు (గరిష్టంగా 24 నెలల వరకు)
పైన తెలియజేసిన ఆప్షన్లు పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) విఛక్షణ మేరకు ఇవ్వబడతాయి.
అవును. మారటోరియం ఆప్షన్ందించబడితే, ఇది అసలు మరియు వడ్డీ రెండిటినీ కవర్ చేస్తుంది. ఈ వ్యవధిలో ప్రాప్తించిన వడ్డీ మూలధనీకరణ అవుతుంది.
ఈ వ్యవధిలో ఒకవేళ మీరు రెగ్యులర్ ఇఎంఐ లేదా పాక్షిక చెల్లింపులు చేయాలనుకుంటే లేదా రుణగ్రహీత మా బ్రాంచ్ కార్యాలయాల్లో దేనినైనా, టోల్ ఫ్రీ నంబరు 1800 266 6444లో సంప్రదించవచ్చు లేదా మా కస్టమర్‌కేర్ ఈమెయిల్ ఐడి కి రాయవచ్చు. customercare@piramal.com
రుణ వ్యవధి ఇప్పుడున్న మేండేట్ వ్యాలిడిటిని మించిపోతే లేదా లోన్ రీస్ట్రక్చర్ అనంతరం ఇఎంఐ సొమ్ములో ఏదైనా మార్పు ఉంటే రుణగ్రహీత తాజా ఆటో డెబిట్ లేదా ఎన్ఎసిహెచ్ మేండేట్లు సమర్పించవలసి ఉంటుంది?
ఉద్యోగం చేసే ఖాతాదారులు సమర్పించవలసిన డాక్యుమెంట్లు |
---|
బ్యాంక్ అకౌంట్లన్నిటికీ అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్లు |
2019 మరియు 2020 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్) |
అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు రుణాలన్నిటి యొక్క రీపేమెంట్ ఘన చరిత్ర |
అదరఖాస్తుదారులందరి యొక్క సిబిల్ సమ్మతి ఫారం |
మార్చి 2020 తరువాత కలిగితే రిలీవింగ్/రిట్రెచ్మెంట్ లేఖలతో పాటు గత 6 నెలల జీతం స్లిప్పులు |
పీరక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు (పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) లోన్) మినహా ఇతర టర్మ్ లోన్ ఏదీ లేకపోతేనే కావాలి) |
మల్ ఫైనాన్స్‌కి కావలసిన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు |
ఉద్యోగం చేయని ఖాతాదారులు పంచుకోవలసిన డాక్యుమెంట్లు |
---|
బ్యాంక్ అకౌంట్లన్నిటికీ అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్లు |
2019 మరియు 2020 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్) |
అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు జిఎస్టి రిటర్న్‌లు (వర్తిస్తే) |
అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు రుణాలన్నిటి యొక్క రీపేమెంట్ ఘన చరిత్ర |
అక్టోబరు 2019 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు (పీరమల్ ఫైనాన్స్ లోన్ మినహా ఇతర టర్మ్ లోన్ ఏదీ లేకపోతేనే కావాలి) |
దరఖాస్తుదారులందరి యొక్క సిబిల్ సమ్మతి ఫారం |
పీరమల్ ఫైనాన్స్‌కి కావలసిన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు |
అర్హులైన రునగ్రహీతలు 15 డిసెంబరు 2020న లేదా ముందుగా దరఖాస్తు చేయాలి.
రీస్ట్రక్చర్డ్ లోన్స్ విధించబడే ప్రాసెసింగ్ ఫీజు లేదా చార్జీలు ఉండవు.
రీస్ట్రక్చర్డ్ లోన్స్ అన్నీ క్రెడిట్ సమాచార కంపెనీలకు ‘‘రీస్ట్రక్చర్డ్’’గా రిపోర్టు చేయబడతాయి మరియు రుణగ్రహీతల యొక్క క్రెడిట్ చరిత్ర ఈ ఫ్రేమ్‌వర్క్ కింద రీస్ట్రక్చర్ చేసిన అకౌంట్లకు వర్తించినట్లుగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల యొక్క సంబంధిత పాలసీల ప్రకారం ఉంటాయి.
లోన్ ధరపై ప్రభావం ఉండదు.
ఆర్బిఐ ప్రకటించిన స్కీమ్ మరియు రుణం అర్హులైన రుణగ్రహీతలందరికీ వర్తిస్తుంది.
రెగ్యులేటరి మరియు లీగల్ అవసరాల ప్రకారం, రుణగ్రహీతలు/సహ- రుణగ్రహీతలు రీస్ట్రక్చరింగ్ ఒప్పందంతో సహా లోన్ స్ట్రక్చర్‌లో ఏవైనా మార్పులపై సంతకం చేయవలసి ఉంటుంది.
మీరు మీ సమ్మతిని రివోక్ చేసుకుంటే, దయచేసి 'STOP' అనే పదంతో సహా (ఎస్ఎంఎస్) 7378799999కి మెసేజ్ పంపండి. మెసేజ్ అందినప్పటి నుంచి 24-48 గంటల లోపు మీ అభ్యర్థనపై చర్య తీసుకోబడుతుంది.