మైక్రోఫైనాన్స్ లోన్ అనేది రూ. 3,00,000 వరకు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబానికి సెక్యూరిటి లేకుండా ఇవ్వబడే లోన్‌గా నిర్వచించబడుతోంది. ఈ ఉద్దేశంతో, కుటుంబం అంటే వ్యక్తిగత కుటుంబ యూనిట్ అని అర్థం, అంటే భర్త, భార్య, మరియు వాళ్ళ అవివాహిత పిల్లలు.
అంతిమంగా ఉపయోగించడంతో నిమిత్తం లేకుండా, సెక్యూరిటి లేని రుణాలన్నీ మరియు వినియోగ/ప్రాసెసింగ్/రుణవితరణ పద్ధతి (భౌతిక లేదా డిజిటల్ చానల్స్ ద్వారా), అల్పాదాయ కుటుంబాలకు ఇవ్వబడుతుంది, అంటే రూ. 3,00,000 వరకు వార్షిక ఆదాయం గల కుటుంబాలను, మైక్రోఫైనాన్స్ లోన్స్‌గా పరిగణించడం జరుగుతుంది.
పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) బోర్డు ఆమోదించిన పాలసీకి అనుగుణంగా రుణగ్రహీతల యొక్క అవసరాల ప్రకారం మైక్రోఫైనాన్స్ లోన్స్‌కి సౌకర్యవంతమైన రీపేమెంట్ వ్యవధి ఇస్తుంది.
5-10 మంది మహిళ సభ్యులకు గ్రూప్‌కి లోన్ (మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక లోన్)
సింపుల్ మరియు సులభ లోన్ ప్రక్రియ
అతితక్కువ డాక్యుమెంటేషన్
24 నెలల వరకు రుణ వ్యవధి
రూ. 10,000 - రూ. 50,000 వరకు లోన్స్