చట్టపరమైన & వర్తింపు

పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ మీ ప్రైవసీని సీరియస్‌గా తీసుకుంటుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించేందుకు కట్టుబడివుంది మరియు కంపెనీకి అందుబాటులో ఉంచిన సమాచారం సురక్షితంగా నిర్వహించబడుతుందని హామీ ఇస్తోంది.

మీ వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వ్యక్తులకు లేదా మూడవ పక్షం వెండర్‌ ఎవరికైనా మీ వ్యక్తిగత సమాచారాన్ని పొరబాటున వెల్లడించడాన్నినిరోధించేందుకు కంపెనీ శాయశక్తులా కృషి చేస్తుంది.

మీరు కంపెనీ వెబ్‌సైట్‌ లేదా ఇతర డిజిటల్‌ వేదికలను (అంటే డిజిటల్‌ లెండింగ్‌కి అప్లికేషన్‌లు మరియు కంపెనీ యొక్క ఇతర మొబైల్‌ అప్లికేషన్‌లు లాంటి అప్లికేషన్‌లు, కానీ వీటికే పరిమితం కావు) ఉపయోగించినప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ సేకరించే, ఉపయోగించే, పంచుకునే, వెల్లడించే, బదిలీ చేసే మరియు విసర్జించే విధానాన్ని ఈ ప్రైవసీ పాలసీ సెట్‌ చేస్తుంది.

కంపెనీ వెబ్‌సైట్‌ మరియు ఇతర డిజిటల్‌ వేదికలను నేవిగేట్‌ చేసే ముందు ప్రైవసీ పాలసీని చదవవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతోంది.

కంపెనీ వెబ్‌సైట్‌ మరియు ఇతర డిజిటల్‌ వేదికల్లో మూడవ పక్షం వెండర్‌ వెబ్‌సైట్‌లకు మరియు ఇతర డిజిటల్‌ వేదికలకి కొన్ని లింకులు ఉండొచ్చునని దయచేసి గమనించండి, ఇవి మీ సౌకర్యం కోసం ఇవ్వబడ్డాయి.

మీరు కంపెనీతో పంచుకున్న సమాచారం యొక్క ప్రైవసీ ప్రాక్టీస్‌లకు మరియు సెక్యూరిటికి కంపెనీ బాధ్యురాలు అవుతుంది, మీరు సందర్శించిన వెబ్‌సైట్‌లు/ఇతర డిజిటల్‌ వేదికల ప్రైవసీ పాలసీని మీరు చదవాలని కంపెనీ అభ్యర్థిస్తోంది మరియు సిఫారసు చేస్తోంది.

వ్యక్తితీ సమాచారం సేకరణ మరియు ఉపయోగించుట

వ్యక్తిగత సమాచారం అనేది గుర్తించబడిన లేదా గుర్తించదగిన సహజ వ్యక్తికి సంబంధించిన ఏదైనా సమాచారం. గుర్తించదగిన సహజమైన వ్యక్తి అంటే పేరు, సంప్రదింపు వివరాలు, గుర్తింపు నంబరు లేదా లొకేషన్‌ డేటా లాంటి ఐడెంటిఫైయర్‌ని ఉపయోగించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించబడే వారు.

మీరు కోరిన విధంగా ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు ఇచ్చేందుకు తెలుసుకోవలసిన ప్రాతిపదికపై మీ వ్యక్తిగత సమాచారం సేకరించబడుతుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడానికి ముందు, అవసరమైన చోట మీ యొక్క విస్పష్టమైన సమ్మతిని కంపెనీ తీసుకుంటుంది. మీరు ఇచ్చిన ఇలాంటి సమ్మతికి కంపెనీ ఆడిట్‌ ట్రెయిల్‌ నిర్వహిస్తుంది.

కంపెనీ లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు మరియు ఇతర మూడవ పోం వెండర్‌లు లాంటి ఇతర సంస్థల నుంచి కంపెనీ పొందిన లేదా మీతో జరిపిన కంపెనీ లావాదేవీల నుంచి పొందిన ఇతర సమాచారంతో మీరు ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ అనుబంధంగా చేర్చవచ్చు.

కోరిన వ్యక్తిగత సమాచారం కంపెనీకి ఇవ్వకపోవడాన్ని మీరు ఎంచుకుంటే కంపెనీ మీకు ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు అందించలేదనే విషయం దయచేసి గమనించండి.

కంపెనీ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ కింది ఉద్దేశాల కోసం ఉపయోగిస్తుంది:

  • మీరు కోరిన ప్రోడక్ట్‌లు మరియు సర్వీసులు ఇవ్వడానికి మరియు కల్పించడానికి లేదా వాటికి సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేసేందుకు ఆసక్తి చూపించడానికి
  • మీరు కోరిన ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు ఇవ్వడంలో మరియు కల్పించడంలో ప్రమేయం ఉన్న లేదా ఆసక్తి వ్యక్తపరిచిన మూడవ పక్షాలతో పంచుకోవడానికి.
  • మీరు కోరిన ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు ఏవైనా లభించకపోతే మీకు తెలియజేయడానికి
  • మీకు ప్రయోజనం కలిగించే ఇతర సంబంధిత ప్రోడక్ట్‌లు మరియు సర్వీసుల గురించి మీకు అప్‌డేట్‌ చేసేందుకు మరియు తదుపరి ఆఫర్‌లు ఇచ్చేందుకు.
  • మోసపూరిత స్క్రీనింగ్‌ మరియు నిరోధకత ఉద్దేశాల కోసం.
  • రికార్డులు ఉంచే ఉద్దేశాల కోసం.
  • మార్కెట్‌ పరిశోధన చేసేందుకు మరియు ఫీడ్‌బ్యాక్‌ పొందేందుకు, దీనివల్ల అందించబడే ప్రోడక్ట్‌లు మరియు సర్వీసులను కంపెనీ మెరుగుపరచగలదు.
  • కంపెనీ యొక్క డిజిటల్‌ వేదికలపై మీ యాక్టివిటి జాడ తెలుసుకునేందుకు.
  • మీకు వ్యక్తిగత ప్రొఫైల్‌ సృష్టించేందుకు, దీనివల్ల కంపెనీ మీ ప్రాధాన్యతలను అర్థంచేసుకోగలదు మరియు గౌరవించగలదు.
  • కంపెనీ యొక్క డిజిటల్‌ వేదికలపై మీ అనుభవాన్ని వ్యక్తిగతం చేయడానికి మరియు మెరుగుపరచడానికి.
  • కంపెనీ మీకు పంపే ఏవైనా కమ్యూనికేషన్‌లను వ్యక్తిగతం చేసేందుకు మరియు/లేదా అనుకూలంగా చేయడానికి
  • కంపెనీ నుంచి పొందడానికి మీరు సమ్మతించిన మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌లను వ్యక్తిగతం మరియు/లేదా అనుకూలంగా చేసేందుకు కంపెనీకి వీలు కల్పించేందుకు ప్రొఫైలింగ్‌ ఉద్దేశాల కోసం.
  • కంపెనీకి వర్తించే రెగ్యులేటరి లేదా లీగల్‌ అవసరాలను నెరవేర్చడం.

కంపెనీ మీకు ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు ఇచ్చినప్పుడు లేదా కంపెనీ ప్రోడక్ట్‌లు లేదా సర్వీసుల్లో మీ ఆసక్తిని కంపెనీ వద్ద మీరు రిజిస్టరు చేసిన చోట, కంపెనీ మీ వ్యక్తిగత సమాచారం సేకరించవచ్చు మరియు నిల్వ చేయవచ్చు, ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్‌ అకౌంట్‌కి సైన్‌ చేసినప్పుడు, కంపెనీ/దాని గ్రూప్‌ కంపెనీల నుంచి (మరియు/లేదా మా లెండింగ్ సర్వీస్‌ ప్రొవైడర్లు మరియు మూడవ పక్షం వెండర్‌ల నుంచి) మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌లు పొందడానికి రిజిస్టరు చేసుకున్నప్పుడు, కంపెనీ ఫారాల్లో ఒకటి నింపాలి (ఆన్‌లైన్‌ అయినా లేదా ఆఫ్‌లైన్‌ అయినా) లేదా పైన తెలియజేసిన ఉద్దేశాల కోసం మీ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీకి ఇవ్వాలి.

మీరు కంపెనీ యొక్క డిజిటల్‌ ప్లాట్‌ఫారాలతో ఇంటరేక్ట్‌ అయినప్పుడు, మీ సందర్శన గురించిన ఈ కింది సమాచారాన్ని కూడా కంపెనీ ఆటోమేటిక్‌గా సేకరించవచ్చు. మీరు కంపెనీ యొక్క డిజిటల్‌ వేదికలను ఎలా ఉపయోగిస్తారో అర్థంచేసుకునేందుకే మరియు మరిన్ని సంబంధిత కమ్యూనికేషన్‌లను సృష్టించడానికి ప్రాథమికంగా ఇ

  • మీరు కంపెనీ యొక్క డిజిటల్‌ వేదికను మరియు మీరు ఉపయోగించిన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఐపి) చిరునామాను ఎలా చేరుకున్నారు.
  • మీ బ్రౌజర్‌ రకం, వెర్షన్‌లు మరియు ప్లగ్‌-ఇన్‌లు, మరియు మీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌.
  • మీరు క్లిక్‌ చేసిన లింకులు మరియు మీరు చేసిన ఏవైనా సెర్చ్‌లు, మీరు పేజీలో ఎంత సమయం ఉన్నారు, మరియు ఇతర పేజీ ఇంటరేక్షన్‌ సమాచారంతో సహా, కంపెనీ డిజిటల్‌ వేదిక ద్వారా మీ ప్రయాణం.
  • మీరు ఏ విషయం కోరుకుంటున్నారు లేదా పంచుకోవాలనుకుంటున్నారు.
  • మీరు ఏ ప్రకటనలు చూశారు మరియు స్పందిచారు.
  • మీరు ఏ పాప్‌ అప్‌ లేదా పుష్‌ మెసేజ్‌లను మీరు చూసివుండొచ్చు మరియు స్పందించివుండొచ్చు.
  • మీ సబ్‌స్క్రిప్షన్‌ స్టేటస్‌.
  • మీరు పూర్తిచేసిన ఏవైనా ఫారాల్లో సేకరించిన సమాచారం.

కంపెనీ వెబ్‌సైట్‌ లేదా డిజిటల్‌ వేదికలకు యాక్సెస్‌ పొందడానికి మీరు ఉపయోగించిన ఐపి చిరునామా నుంచి మీ లొకేషన్‌ని కూడా కంపెనీ ఇప్పుడు సూచిస్తుంది మరియు కంపెనీ యొక్క డిజిటల్‌ వేదికలపై మీరు నిర్దిష్ట చర్య తీసుకోవడానికి ఏ మార్కెటింగ్‌ యాక్టివిటిని కంపెనీ విశ్లేషించవచ్చు (ఉదా:యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయడం).

కెమెరా, మైక్రోఫోన్‌, లొకేషన్‌ లేదా నాన్‌-బోర్డింగ్‌/నో-యువర్‌-కస్టమర్‌ (కెవైసి) నిబంధనల ఉద్దేశం కోసం అవసరమైన ఏదైనా మరొక సదుపాయం లాంటి మీ మొబైల్‌ ఫోన్‌ వనరులకు ఒకసారి యాక్సెస్‌ కంపెనీ అప్లికేషన్‌లకు అవసరం కావచ్చు. మీ సమ్మతి తీసుకున్న తరువాత మాత్రమే ఇలాంటి యాక్సెస్‌ తీసుకోబడుతుంది. అయితే, ఫైల్‌, మీడియా, కాంటాక్ట్‌ జాబితా, కాల్‌ లాగ్స్‌, మరియు టెలిఫోని ఫంక్షన్‌లు లాంటి మీ మొబైల్‌ ఫోన్‌పై వనరులకు యాక్సెస్‌ పొందడాన్ని అప్లికేసన్‌లు నిరోధించేలా కంపెనీ నిర్థారించుకుంటుంది.

ఇంకా, వర్తించే చట్టం అనుమతిస్తే తప్ప కంపెనీ అప్లికేషన్‌లలో లేదా కంపెనీ యొక్క మూడవ పక్షం వెండర్‌ అప్లికేషన్‌లతో ముడిపడివున్న వ్యవస్థల్లో కంపెనీ మీ బయోమెట్రిక్‌ సమాచారాన్ని సేకరిస్తుంది/నిల్వ చేస్తుంది.

తన అప్లికేషన్‌లు లేదా మీకు ప్రోడక్ట్‌లు/సర్వీసులు ఇచ్చే పనులు చేస్తున్న మా మూడవ పక్షం వెండర్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయకుండా కంపెనీ చూస్తుంది, కార్యకలాపాలు నిర్వహించేందుకు కావలసిన ఇలాంటి సమాచారం (పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు లాంటివి) కాకుండా.

నిర్దిష్ట వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించేందుకు సమ్మతిని ఇచ్చే లేదా నిరాకరించే, మూడవ పక్షం వెండర్‌లకు వెల్లడింపును పరిమితం చేసే మరియు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే సమయంలో అప్పటికే మంజూరు చేసిన సమ్మతిని వెనక్కి తీసుకునే ఆప్షన్‌ని కంపెనీ మీకు ఇస్తుంది.

కంపెనీ మీ సమ్మతిని కోరిన ప్రతిసారి వ్యక్తిగత సమాచారం సేకరణ ఉద్దేశాన్ని కంపెనీ పంచుకుంటుంది.
కంపెనీకి ఖచ్చితమైన మరియు పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత కంపెనీది. మీ వ్యక్తిగత సమాచారంలో ఏవైనా మార్పులు ఉంటే దయచేసి కంపెనీకి తెలియజేయండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకొనుట

మీ సమ్మతిని తీసుకున్న తరువాత, కంపెనీ మీ వ్యక్తిగత సమాచారాన్ని సంబంధిత మూడవ పక్షం వెండర్‌లతో పంచుకోవచ్చు, శాసనబద్ధ లేదా రెగ్యులేటరి అవసరాల ప్రకారం పంచుకోవలసిన అవసరం ఉన్న చోట మినహా. కంపెనీ యొక్క ప్రోడక్ట్‌లు మరియు సర్వీసులు ఇవ్వడం, కాంట్రాక్చువల్‌ ఏర్పాట్లను మరియు లీగల్‌ లేదా రెగ్యులేటరి అవసరాలను నెరవేర్చడానికి సంబంధించి అవసరమైన విధంగా కంపెనీ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని ఇలాంటి మూడవ పక్షం వెండర్‌లు ప్రాసెస్‌ చేయవచ్చు.

మూడవ పక్షం వెండర్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కంపెనీకి కావాలి మరియు ఇది పంచుకోబడిన ఉద్దేశాల కోసం మాత్రమే ప్రాసెస్‌ చేయబడుతుంది.

కంపెనీ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ కింది వారితో పంచుకోవచ్చు:

  • చట్టాన్ని అమలుచేసే లేదా ప్రభుత్వ అధికారులతో, సమాచారాన్ని వెల్లడించవలసిందిగా కంపెనీని కోరేందుకు వాళ్ళు తగిన న్యాయ ప్రక్రియను పాటించిన చోట.
  • సర్వీసులు అందించే మూడవ పక్షం వెండర్లతో

లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు (ఎల్‌ఎస్‌పిలు), డిజిటల్‌ లెండింగ్‌ అప్లికేషన్స్‌ (డిఎల్‌ఎలు) and మరియు వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ చేసేందుకు కంపెనీ అధీకృతం ఇచ్చిన కలెక్షన్‌ మరియు రికవరి ఏజెంట్ల జాబితాకు ఇక్కడ యాక్సెస్‌ పొందవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని నిలబెట్టుకొనుట

సుదీర్ఘ కాలం నిలబెట్టుకునే వ్యవధి అవసరమైతే లేదా చట్టం అనుమతిస్తే తప్ప ఈ ప్రైవసీ పాలసీలో వివరించిన వ్యాపార ఉద్దేశాలను నెరవేర్చేందుకు అవసరమైన కాలం పాటు కంపెనీ మీ వ్యక్తిగత సమాచారాన్ని అట్టిపెట్టుకోవచ్చు. సురక్షితమైన విధ్వంస యంత్రాంగాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ విసర్జిస్తుంది.

కుకీస్‌

అనేక ఇతర వెబ్‌సైట్‌ ఆపరేటర్‌లు మామూలుగా ఉపయోగించినట్లుగా, కంపెనీ తన వెబ్‌సైట్‌లో ‘కుకీస్‌’ అనే ప్రామాణిక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కుకీస్‌ అనేవి మీ కంప్యూటర్‌ యొక్క హార్డ్‌ డ్రైవ్‌లో మీ బ్రౌజర్‌ నిల్వ చేసే సమాచారపు చిన్న పీస్‌లు, సందర్శించిన ప్రతిసారి మీరు కంపెనీ వెబ్‌సైట్‌ని ఎలా నేవిగేట్‌ చేస్తున్నారో నమోదుచేసేందుకు వీటిని ఉపయోగిస్తారు.

మీ సందర్శన గురించి ఈ కింది సమాచారాన్ని కంపెనీ ఆటోమేటిక్‌గా సేకరిస్తుంది మరియు తాత్కాలింగా నిల్వ చేస్తుంది:

  • ఇంటర్నెట్‌కి యాక్సెస్‌ పొందడానికి మీరు ఉపయోగించే డొమెయిన్‌ పేరు;
  • మీ సందర్శన తేదీ మరియు సమయం;
  • మీరు సందర్శించిన పేజీలు; మరియు
  • మీరు సందర్శనకు వచ్చినప్పుడు మీరు వచ్చిన వెబ్‌సైట్‌ చిరునామా

కంపెనీ ఈ సమాచారాన్ని గణాంక ఉద్దేశాల కోసం మరియు సందర్శకులకు కంపెనీ సైట్‌ మరింత ఉపయోగకరంగా చేసేందుకు సహాయపడటానికి ఉపయోగిస్తుంది. ఇతరత్రా ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప, మీ గురించిన అదనపు సమాచారం ఏదీ సేకరించబడదు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుట

మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు కంపెనీ సహేతుకమైన ముందుజాగ్రత్తలు తీసుకుంటుంది మరియు కంపెనీకి మీ వ్యక్తిగత సమాచారాన్ని సంభాళించే లేదా ప్రక్రియ చేసే మూడవ పక్షం వెండర్‌ ఎవరైనా ఇదే పని చేయవలసి ఉంటుంది. అనధికారిక యాక్సెస్‌, మోడిఫికేషన్‌, లేదా దుర్వినియోగాన్ని నిరోధించేందుకు మీ వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్‌ పరిమితం చేయబడుతుంది.

వ్యక్తిగత సమాచారాన్ని ప్రభావితం చేసే సెక్యూరిటి ఉల్లంఘనలను కంపెనీ కంపెనీ యొక్క ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియల ప్రకారం మేనేజ్‌ చేస్తుంది.

కంపెనీ సేకరించే వ్యక్తిగత సమాచారం మొత్తం స్థానిక రెగ్యులేటరి అవసరాల ప్రకారం భారతదేశంలో ఉన్నసర్వర్స్‌లో స్టోర్‌ చేయబడుతుంది.

మీ ప్రైవసీ హక్కులు

మీ వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి మరియు సమీక్షించడానికి మరియు సముచితమైన చోట దిద్దుబాటు చేయవలసిందిగా మరియు డిలీషన్‌ చేయవలసిందిగా అభ్యర్థించడానికి కంపెనీ మీకు సహేతుకమైన యాక్సెస్‌ కల్పిస్తుంది. మీ ప్రైవసీని పరిరక్షించేందుకు, మీ వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్‌ మంజూరు చేయడానికి ముందు మీ గుర్తింపును నిర్థారించుకునేందుకు కంపెనీ సహేతుకమైన చర్యలు తీసుకుంటుంది.

  • కంపెనీకి చెప్పవలసిన హక్కు మీకు ఉంది ఒకవేళ మీరు:
  • భవిష్యత్తులో కంపెనీ సంప్రదించకూడదని కోరుకుంటే
  • మీ గురించి కంపెనీకి ఉన్న వ్యక్తిగత సమాచారం కాపీని కోరుకుంటే.
  • కంపెనీ రికార్డుల నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్‌ చేయాలనుకుంటే (మీకు సర్వీసులు అందించడానికి ఉపయోగించే మూడవ పక్షం వెండర్‌ల యొక్క అప్లికేషన్‌లు మరియు కంపెనీ అప్లికేషన్‌లతో సహా).
  • మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయబడటాన్ని రిపోర్టు చేయాలనుకుంటే
  • మీ వ్యక్తిగత సమాచారాన్ని కరెక్టు లేదా అప్‌డేట్‌ చేయాలనుకుంటే

మా ప్రైవసీ పాలసీకి మార్పులు

ప్రైవసీ పాలసీని కంపెనీ ఎప్పటికప్పుడు మార్చవచ్చు మరియు దీని యొక్క అప్‌డేట్‌ వెర్షన్‌ని కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించవలసిందిగా మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి తెలుసుకొనివుండేలా కంపెనీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

ప్రైవసీ ఆందోళనలను సంభాళించుట

మీ ప్రైవసీ హక్కులను వినియోగించుకునేందుకు లేదా ఈ ప్రైవసీ పాలసీ లేదా కంపెనీ డేటా ప్రైవసీ పద్ధతుల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి DPO.financialservices@piramal.comలో
30 నవంబరు 2022 నుంచి అమలులోకి వచ్చింది