వెబ్‌సైట్‌ వాడకపు పాలసీ పీరమల్‌ ఫైనాన్స్‌

వెబ్‌సైట్‌కి యూజర్‌ యాక్సెస్‌ కావడం డిస్‌క్లెయిమర్‌ యొక్క నియమ నిబంధనలన్నిటినీ, ప్రైవసీ పాలసీ మరియు www.piramalfinance.comwww.piramalfinance.comలో తెలియజేసిన వెబ్‌సైట్‌ యూజర్‌ అగ్రిమెంట్‌ని నిర్ద్వంద్వంగా సూచిస్తోంది.

డిస్‌క్లెయిమర్‌ మరియు ప్రైవసీ పాలసీతో పాటు ఈ వెబ్‌సైట్‌ యూజర్‌ ఒప్పందం (ఉమ్మడిగా ఇకపై ‘‘ఒప్పందం’’గా ప్రస్తావించబడుతోంది) ఎప్పటికప్పుడు సవరించినట్లుగా మరియు అనుబంధంగా చేర్చిన విధంగా నియమ నిబంధనలను పొందుపరిచింది (‘‘నిబంధనలు’’, ఇది మీరు, వెబ్‌సైట్‌ సందర్శకుడు/యూజర్‌ (‘‘యూజర్‌’’) ఉపయోగించిన పీరమల్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌ https://www.piramalfinance.com మరియు

https://www.piramalfinance.com ద్వారా చానలైజ్‌ చేసిన వివిధ ఇతర యుఆర్‌ఎల్‌లు (‘‘వెబ్‌సైట్‌’’) ఉపయోగించడం మరియు యాక్సెస్‌ పొందడానికి వర్తిస్తుంది..

 • వెబ్‌సైట్‌కి యాక్సెస్‌ పొందడం మరియు ఉపయోగించడానికి సంబంధించి యూజర్‌కి మరియు పీరమల్‌ ఫైనాన్స్‌కి మధ్య కట్టుబడవలసిన మరియు చెల్లుబాటయ్యే కాంట్రాక్టుగా ఈ ఒప్పందం ఉంటుంది. వెబ్‌సైట్‌కి యూజర్‌ యాక్సెస్‌ పొందడం ఈ ఒప్పందాన్ని యూజర్‌ ఎలాంటి మార్పు/మినహాయింపు లేకుండా సంపూర్ణంగా అంగీకరించినట్లుగా రూఢిపరుస్తున్నారు. ఈ ఒప్పందంలో తెలియజేసిన ఇలాంటి నియమ నిబంధనలు మరియు నోటీసులు వేటినైనా ఏ విధంగానైనా అంగీకరించకపోతే వెబ్‌సైట్‌కి యూజర్‌ తప్పకుండా యాక్సెస్‌ అవ్వకూడదు.
 • యూజర్‌ యాక్సెస్‌ అయిన వెబ్‌సైట్‌ యొక్క నియమ నిబంధనలు మరియు నోటీసులను లేదా వెబ్‌సైట్‌ ద్వారా అందించబడే ఏవైనా సర్వీసులను (ఇకపై ‘‘సర్వీసులు’’గా ప్రస్తావించడమైనది) మార్చడానికి, ఇలా మార్చిన విషయం తెలియజేయకుండానే, పీరమల్‌ ఫైనాన్స్‌కి హక్కు ఉంది.
 • ముందుగా నోటీసు లేదా సమ్మతి ఇవ్వవలసిన అవసరం లేకుండానే, ఏ సమయంలోనైనా సంపూర్ణంగా లేదా పాక్షికంగా వెబ్‌సైట్‌ మరియు/లేదా ఈ ఒప్పందం ద్వారా తాను ఇచ్చిన సేవలు లేదా ఉపయోగించడాన్ని తన స్వీయ విఛక్షణ మేరకు పీరమల్‌ ఫైనాన్స్‌ సవరించవచ్చు. ముందుగా నోటీసు ఇవ్వకుండా, ఏ సమయంలోనైనా వెబ్‌సైట్‌ మరియు/లేదా ఏవైనా సర్వీసులకు లేదా వాటిల్లో కొన్నిటికి యాక్సెస్‌ని తన విఛక్షణ మేరకు ఆపేయడానికి పీరమల్‌ ఫైనాన్స్‌కి హక్కు ఉంది.
 • వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన కొన్ని సేవలు, విశిష్టతలు, ఫంక్షనాలిటి లేదా ప్రోగ్రామ్‌లు (స్వీప్‌స్టేక్స్‌, ప్రమోషన్‌లు, వైర్‌లెస్‌ మార్కెటింగ్‌ అవకాశాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌ తదితర వాటితో సహా) యూజర్‌ ఉపయోగించడం అదనపు నియమ నిబంధనలకు లోబడి ఉండొచ్చు (ఇకపై ‘‘నిబంధనలు’’గా ప్రస్తావించడమైనది) మరియు యూజర్‌ ఇలాంటి సేవలు, విశిష్టతలు, ఫంక్షనాలిటి లేదా ప్రోగ్రామ్‌లు వేటినైనా యూజర్‌ ఉపయోగించడానికి ముందు, అతను వెబ్‌సైట్‌ లేదా సర్వీసులను ఏ విధంగానైనా ఉపయోగించిన మీదట ఇలాంటి అదనపు నిబంధనలను ఉపయోగించినట్లుగా భావించడం జరుగుతుంది.
 • యూజర్‌ యొక్క ఏదైనా డేటా, సమాచారాన్ని వెల్లడించేందుకు సమ్మతించినట్లుగా యూజర్‌ ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు, మరియు వెబ్‌సైట్‌ యొక్క తదుపరి యజమాని లేదా ఆపరేటర్‌ పీరమల్‌ ఫైనాన్స్‌, వర్తించే పీరమల్‌ ఫైనాన్స్‌ డేటాబేస్‌లో ఉన్న యూజర్‌ గురించిన సమాచారాన్ని ఈ నిర్దిష్టమైన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఆస్తులన్నిటి యొక్క విలీనం, ఎక్విజిషన్‌ లేదా విక్రయానికి సంబంధించి తదుపరి యజమానికి లేదా ఆపరేటర్‌కి పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క ఆస్తులన్నిటి విలీనం, ఎక్విజిషన్‌ లేదా విక్రయానికి సంబంధించి ఇలాంటి సమాచారం గురించి కేటాయించిన మేరకు హక్కులు మరియు బాధ్యతలను ఉపయోగించుకోవచ్చని యూజర్‌ విస్పష్టంగా అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి విలీనం, ఎక్విజిషన్‌ లేదా విక్రయం జరిగితే, వెబ్‌సైట్‌ని యూజర్‌ నిరంతరం ఉపయోగించడం వాడకపు నిబంధనలు, వెబ్‌సైట్‌ యూజర్‌ ఒప్పందం, ప్రైవసీ పాలసీ మరియు డిస్‌క్లెయిమర్‌ లేదా వెబ్‌సైట్‌ యొక్క తదుపరి యజమాని లేదా ఆపరేటర్‌ యొక్క నిబంధనలకు కట్టుబడివుంటానని తెలియజేస్తోంది.
 • ఇంటర్నెట్‌ స్వభావం దృష్ట్యా, వెబ్‌సైట్‌ భారతీయ నివాసులను, ప్రవాస భారతీయులను (ఎన్‌ఆర్‌ఐ), భారతీయ మూలం గల వ్యక్తిని (పిఐఒ) లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో దీనికి యాక్సెస్‌ పొందవచ్చు. ఇలాంటి మెటీరియల్‌/సమాచారం పంపిణీని పరిమితం చేసే దేశాల్లో ఉన్న లేదా నివసిస్తున్న వ్యక్తులకు వెబ్‌సైట్‌లోని మెటీరియల్‌/సమాచారం ఉద్దేశించినది కాకపోయినప్పటికీ లేదా అధికార పరిధి గల ఎవరైనా వ్యక్తి, వెబ్‌సైట్‌ లోని ఇలాంటి మెటీరియల్‌/సమాచారం పంపిణీ చేసేందుకు, ఉపయోగించేందుకు లేదా యాక్సెస్‌ పొందేందుకు ఉద్దేశించినది కాదు. యూజర్‌కి ఉన్న అధికార పరిధి గల వర్తించే చట్టాలు మరియు రెగ్యులేషన్‌లను తెలుసుకోవలసిన మరియు సంపూర్ణంగా గమనించవలసినబాధ్యత ప్రతి యూజర్‌కి ఉంది. యూజర్‌ కనుక భారతీయ నివాసి, ఎన్‌ఆర్‌ఐ లేదా పిఐఒ కాకపోతే మరియు అయినప్పటికీ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తుంటే, తనకు తానుగా మరియు తన సొంత రిస్కుపై ఈ పని చేస్తున్నానని అతను రూఢిపరిచారు, అర్థంచేసుకున్నారు మరియు అంగీకరించారు మరియు వెబ్‌సైట్‌ని ఉపయోగించడానికి వర్తించే చట్టాలు వేటినైనా అతిక్రమిస్తే/ఉల్లంఘిస్తే పీరమల్‌ ఫైనాన్స్‌ బాధ్యురాలు కాదు. తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు పీరమల్‌ ఫైనాన్స్‌ అనుమతించని లేదా అనుమతించన దేశాల్లో నివసిస్తున్నవారికి ఏదైనా సమాచారం లేదా సర్వీసులు అందించేందుకు ఆఫర్‌గా లేదా ఆఫర్‌ చేస్తామని ఆహ్వానించినట్లుగా వెబ్‌సైట్‌ని పరిగణించకూడదు. యూజర్‌ కనుక భారతీయ నివాసి కాకపోతే, ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ద్వారా మరియు/లేదా అతని యొక్క వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని లేదా ఏదైనా ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్లో సమర్పించడం ద్వారా, ఇలాంటి డేటాను భారతదేశానికి బదిలీ చేయడానికి, ఇలాంటి డేటాను పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క భారతీయ సర్వర్‌లలో ప్రాసెస్‌ చేయడానికి అతను విస్పష్టంగా సమ్మతిస్తున్నారు, ఇక్కడ అతని డేటా ఈ దేశంలో ఉన్న దానికంటే భిన్నంగా ఉన్న డేటా రక్షణ స్థాయిని అందించే భారతీయ చట్టాల ప్రకారం ఉంటుంది.
 • సర్వీసుల్లో వేటినీ ఏవైనా వాణిజ్య ఉద్దేశాల కోసం విక్రయించనని, ట్రేడ్‌ చేయనని లేదా మళ్ళీ విక్రయించనని యూజర్‌ అంగీకరిస్తున్నారు మరియు వాగ్దానం చేస్తున్నారు. సందేహాన్ని పోగొట్టేందుకు, వెబ్‌సైట్‌ని ఉపయోగించడంతో సహా సర్వీసులు వాణిజ్య ఉపయోగానికి కాదు, కానీ యూజర్‌ వ్యక్తిగతంగా ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించినది.
 • సమాచారం, సాఫ్ట్‌వేర్‌, ప్రోడక్ట్‌లు, సర్వీసులు, వెబ్‌సైట్‌ నుంచి పొందిన మేథోసంపత్తి ప్రాపర్టీని మార్చడం, కాపీ, పంపిణీ, ట్రాన్స్‌మిట్‌, ప్రదర్శన, పెర్‌ఫామ్‌, పునరుత్పత్తి, ప్రచురించడం, లైసెన్స్‌, బదిలీ లేదా విక్రయం నుంచి డెరివేటివ్‌ పనులు సృష్టించనని కూడా యూజర్‌ అంగీకరిస్తున్నారు మరియు వాగ్దానం చేస్తున్నారు. వెబ్‌సైట్‌లోని విషయంలో కొంత భాగాన్ని పరిమితంగా పునరుత్పత్తి చేయడం మరియుకాపీ చేయడం యూజర్‌కి అనుమతిస్తుంది, పీరమల్‌ ఫైనాన్స్‌ ఇతరత్రా నిషేధిస్తే తప్ప. పీరమల్‌ ఫైనాన్స్‌ నిషేధించిన విషయం కోసం యూజర్‌ ముందుగా పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాలి. సందేహం పోగొట్టేందుకు, విషయాన్ని వాణిజ్యలేదా వాణిజ్యేతర ఉద్దేశాల కోసం అపరిమితంగా లేదా గంపగుత్తగా పునరుత్పత్తి, కాపీ చేయడం మరియు వెబ్‌సైట్‌లోని విషయం మరియు సమాచారం మరియు డేటాను అనుచితంగామార్చడం ఖచ్చితంగా నిషేధించడమైనదని స్పష్టం చేయడమైనది.
 • ఇతర వెబ్‌సైట్‌లకు లింకులు వెబ్‌సైట్‌లో ఉండొచ్చు లేదా ఇతర వెబ్‌సైట్‌ల యొక్క ఎలాంటి స్వభావాన్నైనా కలిగివున్న విశిష్టతలు (‘‘లింక్‌డ్‌ సైట్స్‌’’) ఉండొచ్చు. లింక్‌డ్‌ సైట్‌లు పీరమల్‌ ఫైనాన్స్‌ నియంత్రణలో ఉండవు మరియు లింక్‌డ్‌ సైట్‌లో ఉన్న ఏదైనా లింకులేదా ప్రకటనతో సహా లింక్‌డ్‌ సైట్‌ల్లోని విషాయలకు, లేదా లింక్‌డ్‌ సైట్‌లోని ఏవైనా మార్పులు లేదా అప్‌డేట్‌లకు పీరమల్‌ ఫైనాన్స్‌బాధ్యురాలు కాదు. ఏదైనా లింక్‌డ్‌ సైట్‌ నుంచి యూజర్‌ పొందిన ఏదైనా రూపం ట్రాన్స్‌మిషన్‌కైనా పీరమల్‌ ఫైనాన్స్‌ బాధ్యురాలు కాదు. యూజర్‌కి సౌకర్యార్థం కోసం మాత్రమే పీరమల్‌ ఫైనాన్స్‌ ఈ లింకులు ఇస్తోంది మరియు ఏదైనా లింకును చేర్చడం దేనినైనా పీరమల్‌ ఫైనాన్స్‌ లేదా లింక్‌డ్‌ సైట్‌ల యొక్క వెబ్‌సైట్‌ లేదా చట్టబద్ధ వారసులు లేదా వాళ్ళ నియుక్తులతో సహా తన ఆపరేటర్‌లు లేదా యజమానులతో ఏదైనా అనుబంధాన్ని ఆమోదించినట్లుగా సూచించడం లేదు.
 • వారంటీల డిస్‌క్లెయిమర్‌

ఈ వెబ్‌సైట్‌లో తాను ఇచ్చిన సమాచారం మొత్తం కరెక్టు అని నిర్థారించుకునేందుకు పీరమల్‌ ఫైనాన్స్‌ ప్రయత్నించింది, ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన ఏదైనా డేటా లేదా సమాచారం నాణ్యత, ఖచ్చితత్వం లేదా పరిపూర్ణత గురించి రిప్రజెంటేషన్‌లు వేటినీ పీరమల్‌ ఫైనాన్స్‌ వారంటీ ఇస్తోంది మరియు ఖచ్చితంగా లేని దేనికైనా/ఎర్రర్‌కి పీరమల్‌ ఫైనాన్స్‌ ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. వెబ్‌సైట్‌ మరియు/లేదా విషయాలకు సంబంధించి పీరమల్‌ ఫైనాన్స్‌ వారంటీ ఇవ్వడం లేదు మరియు నిర్దిష్ట ఉద్దేశం కోసం ఫిట్‌నెస్‌ వారంటీలన్నిటినీ మరియు వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన లేదా తెలియజేసిన ఇలాంటి ఏదైనా సమాచారాన్ని ఉపయోగించడం వల్ల దాని నుంచి ఉత్పన్నమవ్వడంవల్ల ఎవరైనా యూజర్‌కి లేదా ఎవరైనా ఇతర వ్యక్తికి, ప్రత్యక్షంగా లేదా పర్యవసాఆనల వల్ల కలిగే ఏదైనా నష్టానికి సంబంధించి ఏ విధంగానైనా కలిగే ఏదైనా లయబలిటి,బాధ్యత లేదా ఏదైనా ఇతర క్లెయిమ్‌తో సహా, వెబ్‌సైట్‌లో లేదా ఇతరత్రా తెలియజేసిన సమాచారానికి సంబంధించిన మర్చంటబిలిటి వారంటీలను డిస్‌క్లెయిమ్‌ చేస్తోంది.

వెబ్‌సైట్‌లోని ప్రతి పేజీలో ప్రదర్శించిన లేదా యూజర్‌కి తెలియజేసిన సమాచారం విషయం మరియు విశదీకరణ కరెక్టు అని నిర్థారించుకునేందుకు పీరమల్‌ ఫైనాన్స్‌ వాణిజ్య ప్రయత్నాలు, సహేతుకమైనా లేదా ఇతరత్రా, చేసింది, అయితే మానవ లేదా డేటా ఎంట్రీ ఎర్రర్స్‌ వల్ల కలిగిన ఏవైనా మార్పులకు లేదా ఇలా మారిన సమాచారం వల్ల యూజర్‌ ఎవరికైనా కలిగిన ఏదైనా నష్టం లేదా డేమేజ్‌లకు బాధ్యులు కారు.

పైగా, పీరమల్‌ ఫైనాన్స్‌ సమాచారం ప్రొవైడర్‌ మాత్రమే కాబట్టి, ప్రచురించబడిన విశదీకరణల్లో లేదా మౌఖిక రిప్రజెంటేషన్‌లలో లేదా మౌఖిక రిప్రజెంటేషన్‌లలో మార్పులను నియంత్రించలేదు లేదా నిరోధించలేదు, ఇవి ఎల్లప్పుడూ మూడవ పక్షాలు ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంటాయి మరియు ఇలాంటి మూడవ పక్షం ఇచ్చే ఏదైనా విషయానికి ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఏవైనా నిర్ణయాలు లేదా పెట్టుబడులు పెట్టడానికి ముందు స్వీయ పరిశీలన చేయాలని మరియు వేరే మరియు నిర్దిష్ట లీగల్‌ మరియు ఇతర సలహా తీసుకోవలసిందిగా యూజర్‌లందరినీ హెచ్చరించడమైనది.

పీరమల్‌ ఫైనాన్స్‌ తన వెబ్‌సైట్‌లో ఏవిధంగానూ అడ్వర్‌టైజర్‌ ఎవ్వరినీ ఎండార్స్‌ చేయదు. సమాచారంపై ఆధారపడి ఏదైనా చర్య తీసుకునే ముందు సమాచారం మొత్తం ఖచ్చితత్వాన్ని తమంతట తాము నిర్థారించుకోవాలని యూజర్‌లను కోరడమైనది.

ఈ కింది వాటి వల్ల కలిగిన ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, దండనీయ, సంఘటన, ప్రత్యేక, పర్యవసానాల డేమేజ్‌లకు లేదా ఏవైనా ఇతర డేమేజ్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ పీరమల్‌ ఫైనాన్స్‌ని బాధ్యురాలిగా చేయకూడదు: (ఎ) సర్వీసులను ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం; (బి) సర్వీసులకు ప్రత్యామ్నాయంగా సర్వీసుల సమీకరణ వ్యయం; (సి) యూజర్‌ ట్రాన్స్‌మిషన్‌లు లేదా డేటాకు అనధికారికంగా యాక్సెస్‌ లేదా మార్పుచేయడం; (డి) వెబ్‌సైట్‌ ద్వారా సర్వీసులను పొందడంతో ఏదో విధంగా ముడిపడివుండటం లేదా దాని వల్ల ఉత్పన్నమైన, ఉపయోగించడం, డేటా లేదా లాభాలు కోల్పోవడంతో సహా, సర్వీసులకు సంబంధమున్న ఏదైనా ఇతర విషయం.

కాంట్రాక్ట్‌, టార్ట్‌, నిర్లక్ష్యం, కచ్చితమైన బాధ్యత లేదా ఇతరత్రా అయినా సరే, వెబ్‌సైట్‌ ద్వారా పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి పొందిన ఏదైనా సమాచారానికి, సాఫ్ట్‌వేర్‌, ప్రోడక్ట్‌లు, సర్వీసులు మరియు సంబంధిత గ్రాఫిక్స్‌కి, వెబ్‌సైట్‌ లేదా సర్వీసులు ఉపయోగించడంలో జరిగిన జాప్యానికి లేదా ఉపయోగించలేకపోవడానికి లేదా సర్వీసులకు ప్రొవిజన్‌ లేదా అందించడంలో విఫలం కావడానికి పీరమల్‌ ఫైనాన్స్‌ బాధ్యురాలు కాదు. ఇంకా, కాలానుగుణ మెయింటెనెన్స్‌ పనులు చేసేటప్పుడు లేదా సాంకేతిక కారణాలు లేదా ఏవైనా ఇతర కారణాల వల్ల వెబ్‌సైట్‌కి మరియు/లేదా సర్వీసులకు యాక్సెస్‌ని ప్రణాళిక రహితంగా సస్పెండ్‌ చేయడం వల్ల వెబ్‌సైట్‌ లభించకపోతే పీరమల్‌ ఫైనాన్స్‌ని బాధ్యురాలిగా చేయకూడదు. వెబ్‌సైట్‌ ద్వారా పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న లేదా ఇతరత్రా పొందిన ఏదైనా మెటీరియల్‌/డేటా పూర్తిగా తన విఛక్షణ మరియు రిస్కు మేరకు ఉంటుందని మరియు తన కంప్యూటర్‌ సిస్టమ్స్‌కి కలిగిన ఏదైనా డేమేజ్‌కి లేదా ఏదైనా ఇతర నష్టానికి అతను పూర్తిగా బాధ్యుడని యూజర్‌ అర్థంచేసుకున్నారు మరియు అంగీకరించారు.

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ చట్టం, 1987లోని సెక్షన్‌ 29ఎ కింద నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ 28 ఆగస్టు, 2017 తేదీన జారీచేసిన చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పీరమల్‌ ఫైనాన్స్‌కి ఉంది. అయితే, పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క ఆర్థిక పరిపుష్టిగా ప్రస్తుత పరిస్థితి గురించి లేదా పీరమల్‌ ఫైనాన్స్‌ చేసిన ఏవైనా స్టేట్‌మెంట్‌లు లేదా రిప్రజెంటేషన్‌లులేదా అభిప్రాయాలకు మరియు పీరమల్‌ ఫైనాన్స్‌ డిపాజిట్‌లు తిరిగి చెల్లించడం/అప్పులు చెల్లించడానికి సంబంధించి నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఏ విధంగానూ బాధ్యత స్వీకరించదు లేదా గ్యారంటీ ఇవ్వదు.

(ఎ) కాంట్రాక్టు ఉల్లంఘన, (బి) వారంటీ ఉల్లంఘన, (సి) నిర్లక్ష్యం, లేదా (డి) ఏదైనా ఇతర చర్యకు కారణం వల్ల ఉత్పన్నమైన డేమేజ్‌లతో నిమిత్తం లేకుండా ఈ పరిమితులు, వారంటీలు మరియు మినహాయంపుల డిస్‌క్లెయిమర్‌ వర్తిస్తాయి, ఇలాంటి మినహాయింపులు మరియు పరిమితులను వర్తించే చట్టం నిషేధించని మేరకు.

 • ఈ ఒప్పందానికి అనుగుణంగా యూజర్‌ చేయవలసిన ఉత్తరదాయిత్యం లేదా చేసిన ఏదైనా రిప్రజెంటేషన్‌, వారంటీ, ఒడంబడిక లేదా ఒప్పందంతో సహా, ఈ ఒప్పందంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల లేదా పనిచేయకపోవడం వల్ల ఉత్పన్నమైన లేదా కలిగిన అన్ని నష్టాలు, బాధ్యతలు, క్లెయిమ్‌లు, డేమేజ్‌లు, వ్యయాలు మరియు ఖర్చుల (లీగల్‌ ఫీజు మరియు దీనికి సంబంధించిన వితరణలు మరియు వాటిపై విధించే వడ్డీతో సహా) వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిగే సర్వీసులకు సంబంధించి పీరమల్‌ ఫైనాన్స్‌, దాని అనుబంధ కంపెనీలు, గ్రూప్‌ కంపెనీలు మరియు వాటి డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, మూడవ పక్షం సర్వీసు ప్రొవైడర్‌లకు, మరియు ఏదైనా సర్వీసు అందిస్తున్న ఏదైనా మూడవ పక్షానికి హాని లేకుండా ఉండేందుకు మరియు నష్టపూర్తి కలిగించడానికి యూజర్‌ అంగీకరిస్తున్నారు.
 • పీరమల్‌ ఫైనాన్స్‌ లేదా దాని అనుబంధ కంపెనీలు లేదా గ్రూప్‌ కంపెనీలు ఏవీ లేదా వాటి యొక్క సంబంధిత అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్‌లు, వాటాదారులు, ఏజెంట్లు, లేదా లైసెన్స్‌దారులు ఎవ్వరూ, వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని లేదా దానిలోని ఏదైనా భాగాన్ని యూజర్‌ ఉపయోగించడం (యూజర్‌కి రిజిస్టరు చేసిన అకౌంట్‌ని ఉపయోగించిస్తున్నవారు ఎవరైనా ఉపయోగించడం) వల్ల ఆదాయాలు, లాభాలు, గుడ్‌విల్‌, ఉపయోగించడం, డేటా పోగొట్టుకోవడం లేదా ఇతర ఇంటాంజిబుల్‌ నష్టాలతో సమా ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, సందర్భోచిత, ప్రత్యేక, పర్యవసానాల లేదా ఎగ్జంప్లరీ డేమేజ్‌లకు లయబిలిటి సిద్ధాంతం (కాంట్రాక్టు, టార్ట్‌, శాసనబద్ధ, లేదా ఇతరవి) కింద యూజర్‌కి లేదా మరెవ్వరికీ ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యులు కారు. ఇక్కడ ఉన్నదానికి విరుద్ధంగా ఉన్న దేనితోనూ నిమిత్తం లేకుండా, సర్వీసులకు సంబంధించి ఏదైనా ప్రకటనను ఉపయోగించడం, ప్రచురించడం లేదా వ్యాప్తిచేయడం, లేదా తన అనుబంధ లేదా గ్రూప్‌ కంపెనీ సంబంధ సర్వీసుల్లో వేటినైనా లేదా పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క ఉత్పత్తి, పంపిణీ, ప్రదర్శన లేదా ఇతర దోపిడీని ఏ విధంగానూ బలహీనపరిచే లేదా చేర్చుకోవడం లేదా నిలువరించడానికి సంబంధించి ఇంజంక్టివ్‌ లేదా ఇతర సమాన నమ్మకం లేదా ఏదైనా ఆర్డరు పొందడానికి లేదా కోరడానికి తనకు గల హక్కు లేదా పరిష్కారం దేనినైనా యూజర్‌ నిర్ద్వంద్వంగా మాఫీ చేస్తున్నారు.
 • పీరమల్‌ ఫైనాన్స్‌ కొన్ని పరిస్థితుల్లో మరియు ముందుగా నోటీసు ఇవ్వకుండానే, వెబ్‌సైట్‌ని/పీరమల్‌ ఫైనాన్స్‌ సర్వీసులను యూజర్‌ ఉపయోగించడాన్ని మరియు/లేదా పరిమిత యాక్సెస్‌ పొందడాన్ని వెంటనే ఆంక్షలు పెడుతుంది. ఆంక్షలు పెట్టడానికి/పరిమిత చేయడానికి గల కారణాల్లో ఈ ఒప్పందాన్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేదా ప్రభుత్వ ఏజెన్సీల, యూజర్‌ అభ్యర్థలను యూజర్ అతిక్రమించడం ఉంటాయి. వెబ్‌సైట్‌/పీరమల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ని ఉపయోగించడాన్ని యూజర్‌ వెంటనే నిలిపివేయాలి; ఇలా నిలిపివేసిన విషయాన్ని రాతపూర్వక కమ్యూనికేషన్‌ ద్వారా లేదా ఈ ఒప్పందం యొక్క నియమ నిబంధనల్లో వేటికైనా యూజర్‌ అభ్యంతరం వ్యక్తచేస్తే లేదా గతంలో ఇచ్చిన ఏదైనా ఉపసంహరించుకోవాలనుకుంటే లేదా పీరమల్‌ ఫైనాన్స్‌ సర్వీసు విషయంలో ఏదో ఒక విధంగా అసంతృప్తి చెందితే, యూజర్‌ యొక్క రిజిస్టర్డు ఈ-మెయిల్‌ చిరునామా నుంచి ఈ-మెయిల్‌ పంపడం ద్వారా తెలియజేయడం ఉంటాయి. వెబ్‌సైట్‌/సర్వీసులు మరియు సాఫ్ట్‌వేర్‌ని యూజర్‌ ఉపయోగించడంపై ఆంక్షలు లేదా పరిమితులు విధించేందుకు పీరమల్‌ ఫైనాన్స్‌కి హక్కు ఉంది. యూజర్‌ యొక్క అసంపూర్ణ టాస్క్‌లు వేటినైనా అమలుచేయడానికి లేదా ఏవైనా చదవని లేదా పంపని మెసేజ్‌లను యూజర్‌కి లేదా మూడవ పక్షానికి పంపవలసి బాధ్యత పీరమల్‌ ఫైనాన్స్‌కి లేదా మరియు ఈ విషయంలో యూజర్‌కి హక్కు లేదని యూజర్‌ అంగీకరించారు. వెబ్‌సైట్‌ని యూజర్‌ ఉపయోగించడంపై ఆంక్షలు పెడితే లేదా పరిమితులు విధిస్తే మరియు వెబ్‌సైట్‌లో యూజర్‌ స్టోర్‌ చేసిన డేటా ఏదైనా యూజర్‌ విసర్జించేందుకు అది లభించదు.
 • వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఏదైనా సమాచారానికి సంబంధించి లేదా సమాచారం ప్రాసెసింగ్‌ లేదా వెబ్‌సైట్‌ని ఉపయోగించడానికి సంబంధించి యూజర్‌కి ఏదైనా గ్రీవెన్స్‌ ఉంటే, వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ని సంప్రదించవచ్చు, గ్రీవెన్స్‌లను వేగవంతంగా, కానీ వర్తించే చట్టాల్లో ఇవ్వబడిన సహేతుకమైన కాల వ్యవధి లోపు పరిష్కరించేందుకు వారు ప్రయత్నిస్తారు.
 • ఈ ఒప్పందం కింద తన బాధ్యతలు వేటినైనా నిర్వర్తించడంలో లేదా ఫోర్స్‌ మెజ్యూర్‌ ఈవెంట్‌ వల్ల పనితీరు నిరోధించబడితే, దాడిచిపెడితే లేదా జాప్యమైతే సర్వీస్‌ లేదా దానిలోని ఏదైనా భాగం ఇవ్వడంలో వైఫల్యం జరిగితే పీరమల్‌ ఫైనాన్స్‌ బాధ్యురాలు కాదు మరియు ఇలాంటి సందర్భంలో ఫోర్స్‌ మెజ్యూర్‌ ఈవెంట్‌ కొనసాగినంత కాలం దీని బాధ్యతలు సస్పెండ్‌ అవుతాయి.
 • ఒప్పందం భారతదేశంలోని చట్టాలచే పరిపాలించబడతాయి మరియు ఒకవేళ ఏదైనా వివాదం ఉంటే ముంబయి, ఇండియాలోని కోర్టుల ప్రత్యేక అదికార పరిదికి లోబడి ఉంటుంది.
 • యూజర్‌కి చెల్లింపు పద్ధతులు

చెల్లింపు చేసేందుకు యూజర్‌ ఉపయోగిస్తున్న ఆర్‌టిజిఎస్‌, ఎన్‌ఇఎఫ్‌టి తదితర లాంటి ఇప్పుడున్న సాధారణ చెల్లింపు పద్ధతికి అదనంగా పీరమల్‌ ఫైనాన్స్‌కి చెల్లింపు చేసేందుకు, మీరు రూపే, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) (భీమ్‌- యుపిఐ), యూనిఫైడ్‌ ఇంటర్‌ఫేస్‌ క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ (యుపిఐ క్యూఆర్‌ కోడ్‌) (భీమ్‌-యుపిఐ క్యూఆర్‌ కోడ్‌)తో శక్తివంతమైన డెబిట్‌ కార్డును యూజర్‌ పొందవచ్చు.

పైన తెలియజేసిన మార్గాల్లో చెల్లింపు చేయాలనే ఆసక్తి యూజర్‌కి ఉంటే లేదా ఇంకా ఏదైనా వివరణ/సమాచారం అవసరమైతే, దయచేసి మమ్మల్ని customercare@piramal.com లో సంప్రదించండి.