హోమ్ లోన్‌కి దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?
హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి సమర్పించవలసిన డాక్యుమెంట్లు ఈ కింది విధంగా ఉంటాయి:
గుర్తింపు ధృవీకరణ (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, తదితరవి) చిరునామా ధృవీకరణ (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు లాంటి యుటిలిటి బిల్లులు, మరియు మరికొన్ని) ప్రాపర్టీ డాక్యుమెంట్లు (స్టాంపు పత్రాలపై చేసుకున్న విక్రయ ఒప్పందం, బిల్డర్ నుంచి ఎన్ఒసి, సవివరమైన నిర్మాణ వ్యయం అంచనా, పొసెషన్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఇది ఇప్పటికే నిర్మించబడిన అపార్టుమెంట్ అయితే) ఉద్యోగం చేసే వారికి ఆదాయం ధృవీకరణ (ఆఖరి మూడు నెలల జీతం స్లిప్పులు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫారం 16, తనఖాపెట్టిన ప్రాపర్టీ డాక్యుమెంటు). స్వయం ఉపాధి చేసుకునేవారికి ఆదాయ ధృవీకరణ పత్రాలు (గత రెండు సంవత్సరాలకు కంప్యుటేషన్తో ఐటిఆర్, గత ఆరు నెలల ప్రాథమిక బ్యాంక్ స్టేట్మెంట్, అవసరమైన చోట సిఎ ఆడిట్ చేసిన ఫైనాన్షియల్స్) పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాఫ్‌లు