ఇది ఆర్ బి ఐ సర్క్యులర్ రిజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ 2.0కి కట్టుబడివుంది: వ్యక్తులకు మరియు చిన్న వ్యాపారాలకు కోవిడ్-19 సంబంధ ఒత్తిడిని పరిష్కరించుట (డి ఒ ఆర్.ఎస్ టి ఆర్. ఆర్ ఇ సి. 11/21.04.048/2021-22 తేదీ మే 5, 2021). ఆర్ బి ఐ పొందుపరిచిన వివేకవంతమైన హద్దులకు లోబడి, రిజల్యూషన్ ప్లాన్ ఆచరణీయత మదింపు చేయబడుతుంది.

చెల్లించవలసిన అప్పు మొత్తానికి పరిష్కారం కోసం పరిగణించబడిన రిఫరెన్స్ తేదీ మార్చి 31, 2021. ఇంకా, పీరమల్ ఫైనాన్స్ యొక్క రిటైల్ పోర్టుఫోలియోలోని ఇప్పుడున్న రుణగ్రహీతలకు పాలసీ వర్తిస్తుంది.

ఆర్ బి ఐ అనుమతించే డిస్పెన్సేషన్ తప్పనిసరి డిస్పెన్సేషన్ కాదు, డిస్పెన్సేషన్ ఇ అందించడానికి ముందు రుణగ్రహీతలపై ప్రభావాన్ని పీరమల్ ఫైనాన్స్ మదింపు చేస్తుంది.

 • ఈ పాలసీ కింద డిస్పెన్సేషన్ కి రుణగ్రహీతలు ఆటోమేటిక్ గా అర్హులు కారు. డిస్పెన్సేషన్ మంజూరు చేయబడే ప్రామాణికతను పీరమల్ ఫైనాన్స్ పొందుపరిచింది.
 • డిస్పెన్సేషన్ ని మంజూరుచేయాలన్న/తిరస్కరించాలన్న నిర్ణయం దరఖాస్తు అందినప్పటి నుంచి 30 రోజుల లోపు రుణగ్రహీతలకు రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేయబడుతుంది.

పరిష్కార ప్రాన్ పై ముఖ్య విశిష్టతలు

రుణగ్రహీతల యొక్క ఆదాయ వనరులను బట్టి, పరిష్కార ప్రణాళికలో ఉండేవి:

 • చెల్లింపులను రీషెడ్యూలు చేయుట
 • మరొక క్రెడిట్ సదుపాయంలోకి ప్రాప్తించిన లేదా ప్రాప్తించే ఏదైనా వడ్డీ మారకం
 • మారటోరియం మంజూరు చేయుట
 • వ్యవధి పొడిగింపు

గమనిక: : ఈ ఉద్దేశం కోసం పరిష్కార ప్రణాళికగా రాజీ ప్రకటనలు అనుమతించబడవు.

అర్హమైన లోన్స్ రకం

కంపెనీ యొక్క రిటైల్ డిపార్టుమెంట్ నుంచి ఉద్భవించిన రుణాలన్నిటికీ (పోర్టుఫోలియో కొనుగోళ్ళతో సహా) ఈ పాలసీ వర్తిస్తుంది. పాలసీ ఈ కింది రకాల రుణాలకు వర్తిస్తుంది.

 • హౌసింగ్ లోన్స్
 • వ్యాపార ఉద్దేశంకోసం వ్యక్తులు పొందిన రుణాలు
 • మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ ప్రైజెస్ గా వర్గీకరించినవి కాకుండా, రిటైల్ మరియు హోల్ సేల్ ట్రేడ్ లో ఉద్భవించిన వాటితో సహా, చిన్న వ్యాపారాలకు ఇవ్వబడిన రుణాలు
 • ఆటో లోన్స్
 • పర్సనల్ లోన్స్
 • కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్

అర్హులైన రుణగ్రహీతలు

ఈ కింది కేటగిరిల రుణగ్రహీతలు అర్హులు:

 • పర్సనల్ లోన్స్‌ని పొందిన వ్యక్తులు (సర్క్యులర్‌ డిబిఆర్‌. నం. బిపి. బిసి. 99/08.13.100/2017-18 తేదీ జనవరి 4, 2018, ఎక్స్‌బిఎల్‌ఆర్‌ రాబడులు- బ్యాంకింగ్‌ గణాంకాల అర్బనైజేషన్‌లో నిర్వచించినట్లుగా)
 • వ్యాపారాల నిమిత్తం రుణాలు మరియు అడ్వాన్స్‌లు పొందిన మరియు మార్చి 31, 2021 నాటికి లెండింగ్‌ సంస్థల నుంచి మొత్తం రుణాలు రూ. 25 కోట్లకు మించకుండా పొందిన వ్యక్తులు. ఆర్‌బిఐ సర్క్యులర్‌ RBI/2021-22/46 DOR.STR.REC.20/21.04.048/2021-22, తేదీ జూన్‌ 04, 2021 నాటికి మొత్తం రుణ వితరణపై పరిమితి మార్చి 31, 2021 నాటికి రూ. 50 కోట్లకు సవరించబడింది.
 • మార్చి 31, 2021 నాటికి సూక్ష్మ, చిన్న, మరియు మీడియం సంస్థలుగా వర్గీకరించబడినవి కాకుండా, రిటైల్‌ మరియు హోల్‌సేల్‌ వర్తకంలో ఉన్న వాటితో సహా, చిన్న వ్యాపారాలు, మరియు వీటికి లెండింగ్‌ సంస్థలు మార్చి 31, 2021 నాటికి మొత్తం రుణాలు రూ. 25 కోట్లకు మించకుండా ఇచ్చాయి. ఆర్‌బిఐ సర్క్యులర్‌ RBI/2021-22/46 DOR.STR.REC.20/21.04.048/2021-22, తేదీ జూన్‌ 04, 2021 నాటికి మొత్తం రుణ వితరణపై పరిమితి మార్చి 31, 2021 నాటికి రూ. 50 కోట్లకు సవరించబడింది.

ఈ కింద పేర్కొన్న ప్రామాణికత మొత్తాన్ని రుణగ్రహీతలు నెరవేర్చవలసి ఉంటుంది

 • కోవిడ్-19 పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణగ్రహీత
 • రుణగ్రహీత అకౌంట్లు మార్చి 31, 2021 నాటికి ప్రామాణికంగా వర్గీకరించబడ్డాయి.

గమనిక: అర్హత గల రుణగ్రహీతల యొక్క తుది నిర్ణయం అప్రూవింగ్ అథారిటి కి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

 • మా దరఖాస్తు ఫారానికి వెళ్ళండి మరియు వివరాలు నింపండి.
 • మీ ఆదాయ మరియు కెవైసి పత్రాలన్నిటినీ సమర్పించండి
 • నిర్థారణ కోసం దరఖాస్తు ప్రాసెస్ చేయబడేంత వరకు వేచివుండండి.
 • ప్రతి ఒక్కటీ అర్హత ప్రామాణికతను నెరవేర్చితే, కొద్ది నిమిషాల్లోనే మీ లోన్ ఆమోదించబడుతుంది.
 • ఆ తరువాత, రుణం సొమ్ము వితరణ చేయబడుతుంది మరియు మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేయబడుతుంది.

ఆదాయ వనరులను ప్రభావితం చేసే కోవిడ్-19 వల్ల కలిగే స్ట్రెయిన్ ని ధ్రువీకరించేందుకు నిర్థారణ ప్రక్రియ

పర్సనల్ లోన్స్ కి

పెన్షనర్‌లు లేదా ఉద్యోగం చేస్తున్న వారికి: ఉద్యోగం కోల్పోవుట లేదా జీతం తగ్గిపోవడం తదితరవి ఉంటాయి. దీనిని నిర్థారించుకునేందుకు, తాజా బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను మరియు జీతం స్లిప్పులను పూర్వ వ్యవధితో పోల్చుతూ పీరమల్‌ ఫైనాన్స్‌ చెక్ చేస్తుంది మరియు నిర్థారించుకుంటుంది.

ఉద్యోగులు కాని వ్యక్తులకు: ఆదాయ ప్రవాహం గణనీయంగా పతనమై ఉండాలి. ఈ ఉద్దేశం కోసం, మేము జిఎస్‌టి రిటర్న్‌ని మరియు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను నిర్థారించుకుంటాము.

ఈ ఉభయ పరిస్థితుల్లో, పేపర్‌వర్క్‌ సాక్ష్యాధారాలు ఏవీ లేకపోతే, మహమ్మారి వల్ల ఆదాయం కోల్పోవడం డిక్లరేషన్‌గా కూడా పరిగణించబడుతుంది.

పైన ఇవ్వబడిన ఈ పరిస్థితులే కాకుండా, పరిష్కారం కోసం ఈ కింది పరిస్థితులు కూడా అర్హమవుతాయి, అయితే మీరు ఈ కింది డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు ఇస్తే:

మీకు లేదా మీపై ఆధారపడినవారికి కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే మరియు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం వచ్చివుంటే, దీనికి చికిత్స చేసేందుకు భారీ వ్యయం అయివుంటే, సహాయం పొందడానికి మీరు అర్హులవుతారు.

కోవిడ్‌-19 వల్ల రుణగ్రహీత (మీరు) లేదా సహ రుణగ్రహీత చనిపోవడం

ఉద్యోగం పొందడంలో జాప్యం కావడం లేదా కోర్సును పూర్తిచేయడంలో జాప్యం వల్ల విద్య లోన్‌లో సహాయం.

ఇంటిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం వల్ల లేదా కోవిడ్‌-19 వల్ల నిర్మాణం పూర్తిచేయడంలో జాప్యం వల్ల హౌసింగ్‌ లోన్‌లో సహాయం.

చిన్న వ్యాపార రుణాలకు

గత ఆరు నెలలకు సంస్థ లేదా వ్యాపార యజమానుల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను పరిశీలించవలసిన అవసరం ఉండొచ్చు మరియు వాటిని పూర్వ వ్యవధులతో పోల్చవలసి రావచ్చు.

గత ఆరు నెలలకు సంస్థ లేదా వ్యాపార యజమాని యొక్క జిఎస్‌టి రిటర్నును పరిశీలించవలసిన అవసరం ఉండొచ్చు మరియు వాటిని పూర్వ వ్యవధులతో పోల్చవలసి రావచ్చు.

మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి లాభ నష్టాల యొక్క సెల్ఫ్‌ ఎటెస్టెడ్‌ స్టేట్‌మెంట్‌ ధృవీకరించుకోబడుతుంది.

వడ్డీ రేటు: లోన్ అకౌంట్స్ ‘వడ్డీ రేటు’ ఈ ఫ్రేమ్ వర్క్ కింద ప్రక్షాళన అమలులోకి వస్తుంది మరియు కరెంట్ లోన్ అకౌంట్ అకౌంట్ ల వడ్డీ రేటుకు అదనంగా 0.50% ఉంటుంది.

ఈ ఫ్రేమ్ వర్క్ కింద పరిష్కార ప్రణాళికకు అర్హత లేని కేటగిరిలు/క్రెడిట్ సదుపాయాలు

 • పీరమల్ ఫైనాన్స్ పర్సనల్/సిబ్బంది
 • మార్చి 31, 2021 నాటికి లెండింగ్‌ సంస్థల నుంచి ఉమ్మడిగా మొత్తం రూ. 50 కోట్లు లేదా అంతకంటే తక్కువగా రుణాలు తీసుకున్న ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలు
 • పాడి, మత్స్య, పశు సంవర్థక, పౌల్ట్రీ, బీకీపింగ్‌, మరియు సెరికల్చర్‌ లాంటి అనుబంధ కార్యకలాపాలకు రుణాలు మినహా, మాస్టర్‌ డైరెక్షన్‌ FIDD.CO.Plan.1/04.09.01/2016-17 తేదీ జులై 7, 2016 (అప్‌డేట్‌ చేసినట్లుగా) లోని పేరాగ్రాఫ్‌ 6.1లో జాబితాగా ఇచ్చినట్లుగా వ్యవసాయ క్రెడిట్‌, రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ పరిధి నుంచి మినహాయించడమైనది. పైన ఇవ్వబడిన దానికి లోబడి, రైతుల కుటుంబాలకు ఇవ్వబడిన రుణాలు పరిష్కార చట్రం కింద పరిష్కారానికి అర్హమవుతాయి, పరిష్కార చట్రంలో జాబితాగా ఇచ్చిన మినహాయింపుల కోసం ఇతర షరతులు వేటినీ వాళ్ళు నెరవేర్చని పక్షంలో.
 • ప్రైమరీ అగ్రికల్చరల్‌ క్రెడిట్‌ సొసైటీస్‌కి (పిఎసిఎస్‌), రైతు సర్వీస్‌ సొసైటీలకు (ఎఫ్‌ఎస్‌ఎస్‌), మరియు వ్యవసాయానికి ఆన్‌-లెండింగ్‌ కోసం పెద్ద సైజు ఆదివాసీ మల్టీ-పర్పస్‌ సొసైటీస్‌కి (ల్యాంప్స్‌) రుణాలు.
 • ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లకు లెండింగ్ సంస్థల ఎక్స్ పోజర్లు
 • లెండింగ్‌ సంస్థలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు ఇవ్వుట; స్థానిక ప్రభుత్వ సంస్థలు (ఉదా: మున్సిపల్‌ కార్పోరేషన్‌లు), మరియు పార్లమెంట్‌ లేదా రాష్ట్ర లెజిస్లేచర్‌ చట్టం ద్వారా నెలకొల్పబడిన సంస్థల కార్పొరేట్‌లకు రుణాలు.

ఇక్కడ పేర్కొనబడిన ప్రత్యేక మినహాయింపుకు లోబడి పీరమల్‌ ఫైనాన్స్‌ జారీచేసిన ‘‘కోవిడ్‌-19 సంబంధ ఒత్తిడికి పరిష్కార చట్రంపై పాలసీ’’ కింద పరిష్కార చట్టం 1.0 కింద ఏదైనా పరిష్కారం రుణగ్రహీత అకౌంట్‌లు పొందివుండకూడదు.

అయితే, ఫ్రేమ్‌వర్క్‌ 1.0 (పాలసీ) కింద ఇప్పటికే పరిష్కారం పొందిన అకౌంట్‌లు/ఎక్స్‌పోజర్‌లను గరిష్టంగా 24 నెలల వ్యవధికి లోబడి (ఫ్రేమ్‌వర్క్‌ 1.0 కింద మారటోరియం/అవశేష వ్యవధి పెంపుతో సహా) మారటోరియం/రీపేమెంట్‌ ప్లాన్‌ పొడిగింపుతో సహా పునర్నిర్మించిన షరతులను సమీక్షించేందుకు పరిగణించబడవచ్చు.

ఆర్‌బిఐ సర్క్యులర్‌ తేదీ నుంచి (మే 5, 2021), కోవిడ్‌-19 మహమ్మారి వల్ల కలిగిన ఆర్థిక నష్టం వల్ల అవసరమైన పరిష్కారం దేనినైనా, ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద మాత్రమే తీసుకోవడం జరుగుతుంది.

 • రాతపూర్వక అభ్యర్థనపై (ఈమెయిల్‌తో సహా) లేదా కోవిడ్‌-19 వల్ల ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడిని వివరిస్తూ కాల్‌ సెంటర్‌/కస్టమర్‌ ద్వారా చేసిన అభ్యర్థనపై ఆధారపడి పరిష్కార ప్లాన్‌ కోసం రుణగ్రహీతలను పరిగణించడం జరుగుతుంది.
 • ఆదాయ ధృవీకరణ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు లాంటి డాక్యుమెంట్లు మరియు పీరమల్‌ ఫైనాన్స్‌ మూల్యాంకనం చేసేందుకు అవసరమైన ఇలాంటి ఇతర డాక్యుమెంట్‌ సమర్పించవలసిందిగా రుణగ్రహీతలను అడుగుతారు.
 • ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద పరిష్కారం సెప్టెంబరు 30, 2021కి మించకుండా చేయబడవచ్చు మరియు పరిష్కార ప్రక్రియను అమలుచేసిన తేదీ నుంచి 90 రోజుల లోపు తప్పకుండా ఖరారు చేయబడుతుంది మరియు అమలుచేయబడుతుంది.
 • పైన ఇచ్చిన కాల వ్యవధి దేనినైనా ఏ సమయంలోనైనా ఉల్లంఘిస్తే, సంబంధిత రుణగ్రమీతకు సంబంధించి వెంటనే పరిష్కార ప్రక్రియ వర్తింపజేయడం ఆగిపోతుంది. పైన తెలియజేసిన కాల వ్యవధిని ఉల్లంఘించి అమలుచేసిన పరిష్కార ప్లాన్‌ ఏదైనా, జూన్‌ 7, 2019 తేదీ నాటి ప్రుడెన్షియల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ రిజల్యూషన్‌ ఆఫ్‌ స్ట్రెస్‌డ్‌ ఎసెట్స్‌చే సంపూర్ణంగా నిర్వహించబడుతుంది, లేదా హెచ్‌ఎఫ్‌సి లాంటి లెండింగ్‌ సంస్థ యొక్క నిర్దిష్ట కేటగిరికి పై ఫ్రేమ్‌వర్క్‌ వర్తించని చోట సంబంధిత సూచనలు, మాస్టర్‌ డైరెక్షన్‌-నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ- హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (రిజర్వ్‌ బ్యాంక్‌) డైరెక్షన్స్‌, 2021లోని పేరా 8.3.2లోని నిబంధనల ప్రకారం ఉంటాయి, పరిష్కార ప్రక్రియ ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద ఎప్పుడూ కార్యరూపంలో పెట్టకపోయినట్లుగా.

ఈ కింది షరతులన్నిటినీ నెరవేర్చితేనే పరిష్కార ప్రణాళిక అమలుచేయబడుతుందని భావించబడుతుంది:

 • పీరమల్‌ ఫైనాన్స్‌ మరియు రుణగ్రహీతకు మధ్య అవసరమైన ఒప్పందాల అమలుతో సహా సంబంధిత డాక్యుమెంటేషన్‌ మొత్తం మరియు ఇవ్వబడిన కొల్లేటరల్స్‌, ఏవైనా ఉంటే, అమలుచేయబడుతున్న పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా కంపెనీ పూర్తిచేస్తుంది.
 • రుణాల యొక్క నియమ నిబంధనల్లో మార్పులు పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క పుస్తకాల్లో సంపూర్ణంగా ప్రతిబింబింపజేయబడతాయి.
 • సవరించిన నిబంధనల ప్రకారం రుణగ్రహీత లెండింగ్‌ సంస్థకు డిఫాల్ట్‌ అయివుండకూడదు.

పరిష్కార ప్లాన్‌ని ఖరారు చేసిన మీదట, ఖాతాదారుని సమ్మతి తీసుకోబడుతుంది, మరియు పరిష్కార ప్రణాళిక యొక్క నియమ నిబందనలను వివరిస్తూ, పీరమల్‌ ఫైనాన్స్‌కి మరియు రుణగ్రహీతకు మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది.